వాపు ని బలం అనుకోకూడదు.స్థాయి స్థానం గుర్తించుకొని మేదిలితేనే మంచింది.
అప్పుడే గొంతమ్మ కోరికలు ఎందుకు .పెద్ద కొండను ఎక్కాలంటే కావలసినంత బలాన్ని వెనకేసుకొని వెళ్ళాలి కాని .దేని గురించి మాట్లాడేది అనుకుంటున్నారా ? ఒక యువ దర్శకుడి గురించి.
మంచి పేరు ఉంది, సక్సెస్ రేట్ బాగానే ఉంది .ఈ మధ్య కాలంలో పెద్ద హిట్ దొరికింది .కాని అగ్ర హీరోతో సినిమా అంటే వేరు కదా … కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కుదరాలి, 50 కోట్లదాకా బడ్జెట్, అభిమానుల ఆశలు, హీరో ఇమేజ్ .ఇన్ని బరువులు మోయాలి .మరి ఆ దర్శకుడు ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ కలిపితే కుడా ఆ హీరో పారితోషికం దగ్గరిలో కుడా రాదు…
ఎదో సినిమా నచ్చింది, అభినందించాడు హీరో .కాస్త చనువుగా మాట్లాడాడు .దాన్ని ఆసరా తీసుకొని తనతో సినిమాకి హీరోని కమిట్మెంట్ ఇవ్వమని అడిగాడట .ఇంకేం .హీరో ఉగ్రరూపం దాల్చాడు .కమిట్ మెంట్ ఎలా ఇస్తాను ? ఎందుకు ఇస్తాను అని కడిగిపడేసాడు.
టాలెంట్ ఉంది, కాని ఓపిక కుడా కావలి .ఆ దర్శకుడుకి ఇప్పటికైనా ఈ విషయం అర్థమవ్వాలి.