అప్పుడు త్రివిక్రమ్‌.. ఇప్పుడు కొరటాల శివ వదిలేశాడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సినిమా అంటే సంగీతం ఖచ్చితంగా దేవి శ్రీ ప్రసాద్‌ అన్నట్లుగా అజ్ఞాతవాసి మరియు అరవింద సమేత ముందు వరకు ఉండేది.కాని త్రివిక్రమ్‌ ఆయన్ను పూర్తిగా పక్కకు పెట్టేశాడు.

 Top Directors Koratala Shiva And Trivikram Srinivas Not Doing Films With Devi Sr-TeluguStop.com

మళ్లీ దేవిశ్రీ ప్రసాద్‌ తో వర్క్‌ చేసే అవకాశం ఉందా లేదా అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇదే సమయంలో దేవిశ్రీ ప్రసాద్‌ నుండి మరో దర్శకుడు కూడా తప్పుకున్నాడు.

అపజయం అనేది ఎరుగని దర్శకుడు కొరటాల శివ తన మొదటి సినిమా మిర్చి నుండి మొదలకుని భరత్‌ అనే నేను వరకు అన్ని సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌ తో సంగీతాన్ని ఇప్పించాడు.కాని ఆచార్య సినిమా కు మణిశర్మ తో వర్క్‌ చేస్తున్నాడు.

ఆ తర్వాత ఎన్టీఆర్‌ తో చేయబోతున్న సినిమా కు గాను అనిరుథ్ అంటూ వార్తలు వస్తున్నాయి.దేవిశ్రీ ప్రసాద్‌ నుండి కొరటాల శివ కూడా తప్పుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Devi Sri Prasad, Koratala Shiva, Pushpa, Trivikram-Movie

ఇంతకు ముందు త్రివిక్రమ్‌ వదిలేస్తే ఇప్పుడు కొరటాల శివ కూడా దేవిశ్రీ ప్రసాద్‌ పాటలను తమ సినిమా లకు అక్కర్లేదు అంటూ చెప్పడంతో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్ నడుస్తోంది.ఆచార్య సినిమా కు చిరంజీవి కోరిక మేరకు మణిశర్మతో ట్యూన్స్‌ చేయించి ఉంటాడు.కాని ఎన్టీఆర్‌ సినిమా కు ఎందుకు కొరటాల శివ ఆయనతో కాకుండా వేరే సంగీత దర్శకుడితో పని చేయబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే సుకుమార్‌ కు చాలా ఆఫర్లు తగ్గిపోయాయి.

ఈ సమయంలోనే త్రివిక్రమ్‌ మరియు కొరటాల లు కూడా తమ సినిమా లకు కొత్త సంగీత దర్శకులను చూసుకుంటున్న నేపథ్యం లో దేవి శ్రీ ఆఫర్లు మరిన్ని తగ్గాయి.ఈ పరిణామాలు ఆయన కెరీర్ పై చాలా ప్రభావం చూపుతుందని అంటున్నారు.

పుష్ప సినిమా తో అయినా దేవి శ్రీ మళ్లీ పూర్వ పరిస్థితికి వస్తాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube