ఒకటి రెండు సినిమాలతోనే టాప్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న యంగ్ డైరెక్టర్స్..

ఎప్పుడు వచ్చామన్నది కాదు.బుల్లెట్ దిగిందా? లేదా? అనేది ముఖ్యం అంటాడు ఓ సినిమాలో హీరో.అలాగే సినిమా పరిశ్రమలో ఎంత కాలంగా కొనసాగుతున్నాం అనేది ముఖ్యం కాదు.ఒకటి రెండు హిట్లతోనే టాప్ పొజిషన్ సంపాదించామా? లేదా? అనేది ఇంపార్టెంట్.అలాగే చాలా మంది దర్శకులు ఎన్నో సినిమాలు తెరకెక్కించినా రాని గుర్తింపు.కొంత మంది ఒకటి రెండు సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

 Top Directors Crazy Projects After 2 Projects Details, Tollywood Director, Top H-TeluguStop.com

అలాంటి దర్శకులు కొందరు ఏ ప్రాజెక్టు చేసినా మంచి సక్సెస్ అందుకుంటారు.సినిమా పరిశ్రమలో టాప్ దర్శకులకు కూడా దక్కని అవకాశం.

ఒకటి రెండు సినిమాలు చేసిన యంగ్ దర్శకులతో అగ్రతారలు నటించేందుకు రెడీ కావడం నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు.తమ అద్భుత టాలెంట్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

గౌతమ్ తిన్ననూరి. తను తెరకెక్కించిన తొలిసినిమా జెర్సీ.నాని హీరోగా చేసిన ఈ సినిమాతో అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు.అంతే కాదు.

తన డెబ్యూ సినిమాకే జాతీయ అవార్డును అందుకున్నాడు.దీన్ని బట్టి ఆయన టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో తెరకెక్కిస్తున్నాడు.ఇందులో రాంచరణ్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ దెబ్బతో చిన్న హీరోలతో సినిమాలు చేసే స్థాయి నుంచి పెద్ద హీరోలతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు.

అటు వెంకీ కుడుముల కూడా ఇదే రీతిలో ముందుకు సాగుతున్నాడు.ఈ యంగ్ దర్శకుడు టాలీవుడ్ టాప్ హీరో చిరంజీవితో సినిమా చేస్తున్నాడు.వాస్తవానికి వెంకీ ఇప్పటి వరకు కేవలం రెండు సినిమాలు మాత్రమే చేశాడు.

ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.మరో దర్శకుడు బుచ్చిబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఆయన ఎన్టీఆర్ కు కథ చెప్పాడట.

ఆల్మోస్ట్ ఈ సినిమా కథ ఓకే అయ్యిందట.

Top Directors Crazy Projects After 2 Projects Details, Tollywood Director, Top Heroes, Buchi Babu Sana, Venky Kudumula, Goutham Tinna Nuri, Ram Charna, Chiranjeevi, Jr Ntr, Crazy Projects - Telugu Buchi Babu Sana, Chiranjeevi, Crazy Projects, Jr Ntr, Ram Charna, Tollywood, Top Heroes, Venky Kudumula

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube