Cheap Electric Scooters : ఇండియాలో చీపెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..

తక్కువ ధరలతో పాటు ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్లు, బైక్స్ కోసం ప్రజలు ఎక్కువగా వెతుకుతున్నారు.అలాంటి వారి కోసం తక్కువ ధరలలోనే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇండియాలో రిలీజ్ చేశారు.అవేంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం.

 Cheap Electric Scooters In India,hero Electric Flash,eeve Ahava,avan Trend E, El-TeluguStop.com

• అవాన్ ఈ-స్కూటర్

Telugu Scooters-Latest News - Telugu

అవాన్ ఈ-స్కూటర్ ధర రూ.45,000.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 65 కి.మీ వరకు వెళ్లగలదు.గంటకి 25 కిమీ వేగం తో ప్రయాణిస్తుంది.ఈ స్కూటర్ బ్యాటరీ ఛార్జ్ అవడానికి 6-8 గంటల సమయం పడుతుంది.

• బౌన్స్ ఇన్ఫినిటీ E1

Telugu Scooters-Latest News - Telugu

ఇండియా మార్కెట్‌లో బాగా పాపులర్ అయిన వాటిలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ ఒకటి.ఈ స్కూటర్ ధర రూ.45,099. ఈ స్కూటర్‌ని ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 85 కి.మీ వరకు ప్రయాణించగలదు.అంతేకాకుండా, గంటకు 65 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

• హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్

Telugu Scooters-Latest News - Telugu

ఈ స్కూటర్ ధర రూ.46,640.దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 85 కిమీ వరకు ప్రయాణించగలదు.

ఈ స్కూటర్ గంటకు 25 కి.మీ వేగంతో వెళ్తుంది.

• అవాన్ ట్రెండ్ ఈ

Telugu Scooters-Latest News - Telugu

అవాన్ ట్రెండ్ ఈ-స్కూటర్ ధర రూ.56,900.ఈ స్కూటర్ సింగిల్, డబల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.సింగిల్ బ్యాటరీ 65 కి.మీ వరకూ ట్రావెల్ రేంజ్ అందిస్తుంది.అదే సమయం లో డబల్ బ్యాటరీ దాదాపు 110 కి.మీ వరకు ట్రావెల్ రేంజ్ అందిస్తుంది.ఈ రెండిటి వేగం గంటకు 45 కి.మీ వరకూ ఉంటుంది.

• ఈవీ అహవా

Telugu Scooters-Latest News - Telugu

ఈవీ అహవా స్కూటర్ ధర రూ.62,499.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 60 నుంచి 70 కిమీ వరకూ ప్రయాణిస్తుంది.

ఇది ఛార్జ్ అవడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది.ఈ స్కూటర్‌లో లేటెస్ట్ ఫీచర్స్‌ చాలానే ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube