ఒకప్పటి టాప్ యాంకర్ అనితా చౌదరి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

ఒకప్పటి టాప్ యాంకర్ అనితా చౌదరి అంటే తెలియని వారుండరు.ఒకవైపు యాంకర్ గా చేస్తూనే సీరియల్స్ లో, సినిమాల్లో నటించి అనితా చౌదరి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 Interesting  Facts About Top Anchor Anitha Chowdary,  Anitha Chowdary, Ruthu Raa-TeluguStop.com

ఛత్రపతి సినిమాలో సూరీడు తల్లి పాత్రలో నటించినా, సంతోషం సినిమాలో నాగార్జున సిస్టర్ పాత్రలో నటించినా ప్రతి పాత్రతో అనితా చౌదరి గుర్తింపు తెచ్చుకున్నారు.అమృతం, నాన్న సీరియళ్లు కూడా ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

కొంతకాలం సినిమాలకు, సీరియళ్లకు దూరంగా ఉన్న అనితా చౌదరి ఉయ్యాల జంపాల సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.ఈటీవీ ఛానెల్ లో కస్తూరి సీరియల్ తో నటిగా ప్రస్థానం ప్రారంభించిన అనితా చౌదరి దాదాపు ఏడు సంవత్సరాల పాటు లీడ్ రోల్ లో నటించి ఆ సీరియల్ కు ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.

డ్యాన్సర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనితా చౌదరి అనుకోకుండా యాంకర్ గా, నటిగా మారారు.

రుతురాగాలు సీరియల్ కూడా సూపర్ హిట్ అయింది.

ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో తెరకెక్కిన తాళి సినిమాలో మొదట అనితా చౌదరికే హీరోయిన్ గా అవకాశం దక్కింది.అయితే రాజమండ్రిలో ఆరు నెలల పాటు షూటింగ్ అని చెప్పడంతో ఆమె అందుకు అంగీకరించలేదు.50కు పైగా సినిమాల్లో నటించిన అనితా చౌదరి ఎన్నారైను పెళ్లి చేసుకుంది.ఈమెకు ఒక కొడుకు.

ఇప్పటికీ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ అనితా చౌదరి మంచి పేరు సంపాదించుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube