టాప్ హీరో మీద వ్యతిరేక ప్రచారం చేయిస్తున్న హీరో  

Top Actor Defaming Another Top Actor-

సినిమా ఇండస్ట్రీలో అభిమానులకే తప్పా, హీరోల మధ్య వైరం ఉండదని అంటుంటారు.కాని ఇది ప్రతిసారీ నిజం కాదు.ఇప్పుడు మేం చెప్పబోతున్న విషయాలు మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి.తాము ఎదుగుతున్నామని చెప్పుకోవడానికి మరో హీరోని తక్కువగా చూపిస్తున్న ఒక హీరో గురించే ఈ కథనం.తన సినిమాలు ఆడాలి, తన సినిమాలు మాత్రమే ఆడాలి అనే రకం ఆ హీరో అంటుంటారు సినీజనాలు.

Top Actor Defaming Another Top Actor---

పక్క హీరోల సినిమాల మీద పబ్లిక్ గానే కమెంట్ చేయడం ఆ హీరోకి ఉన్న అలవాటు.సినిమాలో మాత్రమే కాదు, మీడియా ముందు కూడా బాగా నటిస్తాడు.ఎప్పటికైనా నెం.1 హీరో అనిపించుకోవాలనేది ఈయనగారి కల.

తాను రోజురోజుకి ఎదుగుతున్నాడు.మంచి విషయం.మంచి ఫామ్ లో ఉన్నాడు.ఇది కూడా మంచి విషయం.నేను బాగా చేస్తున్నాను అని ప్రచారం చేయించుకుంటే సరిపోద్ది.కాని పక్క హీరో కన్నా నేనే బాగా చేస్తున్నాను అని జాతీయ మీడియాలో కథనాలు రాయించడం ఏంటండి విడ్డూరం కాకపోతే.

పేరు అప్రస్తుతం కాని, ఒక ప్రముఖ జాతీయ వెబ్ సైట్ లో, ఒక ప్రముఖ రిపోర్టర్ ని ఆ హీరో అదుపులో పెట్టుకున్నట్లు సమాచారం.లెక్కలు మార్చేయడం, ఆ హీరో కన్నా నేనే పెద్ద అన్నట్లు కథనాలు రాయించడం ఈ హీరో చేస్తున్న పని.

బయటి జనాలకు ఈ విషయాలన్ని తెలియకపోవచ్చు కాని, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళలో కొంతమందికైనా రేపోమాపో ఈయనగారి అతితెలివితేటలు తెలిసిపోతాయి కదా ! తెలిస్తే ఏం మాట్లాడుకుంటారో అన్న అలోచనే లేకుండా తెగించేస్తున్నాడు.చూద్దాం … ఎన్నిరోజులు తన ఆటలు కొనసాగుతాయో!