ఐపీఎల్ లో రూ.100 కోట్లు సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..!

ఐపీఎల్ సీజన్-16( IPL 16 ) మరో కొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం అవ్వనుంది.మార్చి 31 నుండి మే 28 వరకు మ్యాచులు జరిగే అవకాశం ఉంది.

 Top 5 Players Who Are Part Of The Ipl 100 Crore Club Details, Top 5 Players , Ip-TeluguStop.com

తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.ప్రస్తుతం క్రికెట్ అభిమానుల మధ్య ఐపీఎల్ పై చర్చ నడుస్తోంది.

ఏది ఏమైనప్పటికీ ఐపీఎల్ ద్వారా చాలామంది స్టార్ క్రికెటర్లుగా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు కోట్లు సంపాదించి కోటీశ్వరులుగా మారారు.ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటిదాకా రూ.100 కోట్లు సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

1.మహేంద్రసింగ్ ధోని:

Telugu Ab Devillers, Bcci, Cricket, Ipl Crore Club, Ipl, Mahendrasingh, Rohit Sh

ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి 2022 వరకు అత్యధికంగా సంపాదించిన వారి జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.గత ఏడాది 2022 వరకు రూ.164.84 కోట్లు ఐపీఎల్ ద్వారా సంపాదించాడు.2018 నుండి రూ.15 కోట్ల రూపాయలను నాలుగు సంవత్సరాల పాటు తీసుకుని, గత రెండు సంవత్సరాలుగా తన ఫీజును రూ.3 కోట్లు తగ్గించి రూ.12 కోట్లు తీసుకున్నాడు.ఐపీఎల్ ద్వారా ఇప్పటివరకు మహేంద్రసింగ్ ధోని( MS Dhoni ) మొత్తం సంపాదన రూ.176.84 కోట్లు.

2.రోహిత్ శర్మ:

Telugu Ab Devillers, Bcci, Cricket, Ipl Crore Club, Ipl, Mahendrasingh, Rohit Sh

ఐపీఎల్ ప్రారంభం నుండి ఇప్పటివరకు రూ.162 కోట్లు సంపాదించి రెండవ స్థానంలో ఉన్నాడు.2022 నుండి ప్రతి ఏటా రూ.16 కోట్ల రెమ్యూనరేషన్ పొందుతున్నాడు.రోహిత్ శర్మ( Rohit Sharma ) సారథ్యంలో ముంబై జట్టు ఐదు సార్లు టైటిల్ కైవసం చేసుకుంది.

3.విరాట్ కోహ్లీ:

Telugu Ab Devillers, Bcci, Cricket, Ipl Crore Club, Ipl, Mahendrasingh, Rohit Sh

ఐపీఎల్ చరిత్రలో కోహ్లీకి ( Kohli ) ఓ ప్రత్యేకమైన రికార్డు ఉంది.ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఒకే ఫ్రాంచైజీ కి ఆడుతున్నాడు.ఇక ఐపీఎల్ ప్రారంభమైనప్పటినుండి 2022 వరకు రూ.150.20 కోట్లు సంపాదించాడు.2018 నుండి 2021 వరకు ప్రతి ఏటా రూ.17 కోట్లు తీసుకొని, 2022 నుండి రూ.15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

4.సురేష్ రైనా:

Telugu Ab Devillers, Bcci, Cricket, Ipl Crore Club, Ipl, Mahendrasingh, Rohit Sh

2022 నుంచి సురేష్ రైనా ఐపీఎల్ కు దూరమయ్యాడు.ఐపీఎల్ ప్రారంభం నుండి 2021 వరకు రూ.100.74 కోట్లు సంపాదించాడు.ఇతను తీసుకున్న చివరి వార్షిక వేతనం రూ.11 కోట్లు.

5.ఎబి డివిలియర్స్:

Telugu Ab Devillers, Bcci, Cricket, Ipl Crore Club, Ipl, Mahendrasingh, Rohit Sh

దక్షిణాఫ్రికాకు చెందిన ఈ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ ద్వారా 100 కోట్ల 51 లక్షల 65 వేల రూపాయలు సంపాదించాడు.ఇతను చివరిసారిగా 2021 లో ఆడి, వార్షిక వేతనం రూ.11 కోట్లు సంపాదించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube