ఇండియాలో తీసిన టాప్ 12 గే/లెస్బియన్ సినిమాలు

ఉత్తమ చిత్రం 2016 ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా ఏమిటో తెలుసా? గూగుల్ చేయాల్సిన అవసరం లేదులెండి.ఆ సినిమా పేరు “మూన్ లైట్”.

 Top 12 Lesbian/gay Films And Series In India-TeluguStop.com

ఇది హృదయాల్ని హత్తుకునే ఒక గే కథ.అందుకే “లాలాలాండ్” లాంటి పాపులర్ సినిమాను కాదని ఈ సినిమాకి ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చారు.ఇలా గే/లెస్బియన్ జీవితాలను తెర మీద ఆవిష్కరించడం హాలివుడ్ వారికి కొత్తేమి కాదు.మరి భారతీయ చలచిత్ర రంగంలో ఇలాంటి సాహాసాలు చేస్తున్నారా ? కమర్షియల్ మాస్ సినిమాలే చూస్తాం కాబట్టి మనకు అంత సినిమా జ్ఞానం ఉండదు కాని మన దేశంలో కూడా స్వలింగ సంపర్కుల జీవితాలని చూపించిన సినిమాలు ఉన్నాయి.ఈ ట్రెండ్ కొత్తగా మొదలవలేదు.1970ల్లోనే మొదలైంది.1978 “రండు పెంకుటిక్కల్” అనే మళయాళ సినిమా ఇద్దరు మహిళల మధ్య ప్రేమను చూపించింది.ఆ తరువాత పదుల సంఖ్యలలో స్వలింగ సంపర్కుల సినిమాలు వచ్చాయి.

అయితే మీకోసం ఓ 12 సినిమాలు/టీవీ సీరిస్ ఇక్కడ పరిచయం చేస్తున్నాం.

#1) The ‘Other’ Love Story :

ఇదొక వెబ్ సీరీస్, సినిమా కాదు.ఆధ్య – ఆంచల్ అనే ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ బంధాన్ని ఏంతో పోయేటిక్ గా తీసారు.లిప్ కిస్ సన్నివేశాలు ఉన్నా, అవి వల్గర్ గా ఉండవు.

స్వచ్చమైన ప్రేమకథ ఇది.ఎదో బూతు సీరీస్ కాదు.మీరు ఒకసారి చూస్తే ఇది సజెస్ట్ చేసినందుకు మెచ్చుకోకుండా ఉండలేరు.

#2) Margarita With A Straw (2014) :

మనదేశంలోనే కాదు.ప్రపంచంలో ఉన్న అతిగొప్ప నటుల్లో ఆమీర్ ఖాన్ ఒకరు.అలాంటి నటుడితో కంటతడి పెట్టించిన సినిమా ఇది.శారీరక లోపాలు ఉన్న అమ్మాయి ప్రేమను వెతుకుతుంది.తన జీవిత అనుభవాలు, ఒక అమ్మాయితో ప్రేమ సంబంధం .ఇది కథ వస్తువు.ఇందులోనూ కిస్సింగ్ సీన్స్ ఉన్న అస్సలు వల్గర్ గా ఉండవు.

#3) Aligarh (2015) :

ఇటు విమర్శకుల ప్రశంసలు, అటు అవార్డులు, కొద్దిపాటి బాక్సాఫీస్ వసూళ్లు, అన్ని దక్కాయి ఈ సినిమాకు.ఇది ఒక రియల్ స్టోరి.స్వలింగ సంపర్కుడైన డాక్టర్ శ్రీనివాస్ రామచంద్ర సిరాస్ జీవితాన్ని ఇందులో చూపించారు.

#4) Girlfriend (2004) :

ఇదేమి క్లాసిక్ సినిమా కాదు.ఫక్తు కమర్షియల్ సినిమా.బాలివుడ్ లో పేరు సంపాదించిన ఇషా కొప్పికర్, అమృత అరోరా లాంటి హీరోయిన్లు ఇందులో బెడ్ రూమ్ సీన్ చేయడం అప్పట్లో ఓ పెద్ద సంచలనం.

ఇదేమి క్లాస్ సినిమా కాదు కాబట్టి చూడాలో వద్దో మీరే నిర్ణయించుకోవాలి.

#5) My Brother Nikhil (2005) :

ఓ గే కపుల్ .వారి బంధాన్ని అర్థం చేసుకోలేని సమాజం.దీన్నే కథావస్తువుగా ఓ అందమైన సినిమాని తీసారు.

అలనాటి బాలివుడ్ టాప్ హీరోయిన్ జుహీ చావ్లా ఇందులో ముఖ్యపాత్ర పోషించింది.ఇందులో ఎయిడ్స్ వ్యాధి మీద అవగాహన కూడా కల్పించారు.

#6) My Life Partner (2014) :

మళయాళ సినిమాలు అంటేనే అందమైన సినిమాలు.మన దేశంలో మంచి సినిమాలు తీయాలంటే ఆ ఇండస్ట్రీ తరువాతే ఏదైనా.2014లో వచ్చి ఇద్దరు మగవారి మధ్య బంధాన్ని ఏంతో అందంగా చూపించిన మై లైఫ్ పార్టనర్ ఓ క్లాసిగ్ గా గుర్తింపు పొందింది.IMDBలో దీని రేటింగ్ ఏకంగా 8.9/10.

#7) Fire (1998) :

ఈ సినిమా అప్పట్లో ఓ పెద్ద వివాదం.సినిమాను విడుదల కానిచ్చేది లేదు అని పట్టుబట్టారు భారతీయ సంస్కృతీ సంఘాల వారు.ఇద్దరు ఆడవాళ్ళ మధ్య శారిరక’ సంబంధాన్ని ఎలా చూపిస్తారు అంటూ రచ్చ రచ్చ చేసారు.

ఈ సమాజపు మూర్ఖత్వాన్ని ప్రశ్నించిన ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడి క్లాసిక్ అనే పేరు తెచ్చుకుంది.

#8) Sancharram (2004) :

సిటిల్లోనే స్వలింగ సంపర్కాన్ని చాలామంది విమర్శిస్తారు.మరి పల్లెటూళ్ళలో ఇంకెలా ఉంటుంది పరిస్థితి ? అలాంటి సెన్సిటివ్ కథాంశాన్ని మలయాళ సినిమా సంచార్రంలో చూపించారు.ఒక పల్లెటూళ్ళో ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ ఈ సినిమా.

#9) Mumbai Police (2013) :

రిస్కీ కథలు.సినిమా కోసం ఏమైనా చేసే నటులు .ఇవే మలయాళ సినిమా ఆస్తులు.ముంబై పోలిస్ ఓ విభిన్నమైన పోలీసు కథ.మలయాళంలో పెద్ద హీరో అయిన పృద్విరాజ్ ఓ గే క్యారక్టర్ చేయడమే కాదు, ఒక రొమాంటిక్ సీన్ కూడా చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

#10) Family Album (2015) :

ఇదో బెంగాలి లవ్ స్టోరి.కానీ అమ్మాయి అబ్బాయి మధ్య కాదు.ఇద్దరు అమ్మాయిల మధ్య.

మామూలుగానైతే ఒక లవ్ స్టోరిలో కామెడి, ఎమోషన్స్, కిస్సింగ్ సీన్స్ ఎలా ఉంటాయో .అవన్నీ ఇద్దరు అమ్మాయిల మధ్య ఉంటాయి.ఇదో మంచి టైంపాస్ సినిమానే కాని బూతు సినిమా కాదులెండి.

#11) Big F :

మాకు తెలిసినంతవరకు భారతీయ టీవీ చరిత్రలో మొట్టమొదటి సారి ఓ లెస్బియన్ కిస్ ని చూపించిన టీవీ సీరీస్ ఇది.MTV లో వచ్చిన ఈ సీరీస్ లెస్బియన్ అనే స్టాంప్ తో చూపరుల దృష్టిని ఆకట్టుకుంది.సినిమాల్లోనే కష్టం అనుకుంటే, టీవిలో ఇలాంటి సబ్జెక్టు ఎంచుకోవడం నిజంగా ధైర్యమే.

#12 ) Dev DD :

ఇది కూడా సినిమా కాదు.ఒక వెబ్ సీరీస్.మొట్టమొదటి లెస్బియన్ వెబ్ సీరీస్ కాదు కాని, ఇది ఎక్తా కపూర్ లాంటి బాలివుడ్ బడా నిర్మాత నుంచి వస్తుండటంతో అంచనాలు ఎక్కువ ఉన్నాయి.ఇది వెబ్ సీరీస్ రూపంలో యూట్యూబ్ లో టెలికాస్ట్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube