ఈ మధ్య రష్మిక మందాన పేరు ఇంటర్నెట్ లో చాలా హల్ చల్ చేసింది.సడెన్ గా ఈ కన్నడ బ్యూటీని నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేశారు.
ఇలా రష్మికనే కాదు.ఇంతకు ముందు కూడా ప్రియా ప్రకాష్ వారియర్ నవ్వకు ఫిదా అయ్యారు నెటిజన్లు.
తనను కూడా నేషనల్ క్రష్ గా మార్చేశారు.ఇలా మన వాళ్లు కొందరు హీరోయిన్స్ తో పాటు సెలబ్రిటీస్ ను నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేశారు.ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం.
మానుషి చిల్లర్

2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన ఈ బ్యూటీకి మనవాళ్లు పడిపోయారు.అప్పట్లో ఈ బ్యూటీని ఓవర్ నైట్ లో నేషనల్ క్రష్ ని చేశారు.
దిశ పఠాని

ఎంఎస్ ధోని సినిమాలో క్యూట్ గర్ల్ గా కనిపించి అదరిని మాయ చేసింది.దిశ ఆ తర్వాత ఇన్స్టాలో బోల్డ్ బికినీ పిక్స్ తో రచ్చలేపి పాపులారిటీ సొంతం చేసుకుంది.
స్మృతి మందాన

ఇండియన్ ఉమెన్ క్రికెట్ లో బెస్ట్ స్మైల్ అండ్ లుక్ తో ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యింది క్రికెటర్ స్మృతి.చక్కటి రూపంతో ఎంతో మంది యువకుల మనసులు దోచుకుని నేషనల్ క్రష్ గా మారింది.
శెర్లీ సెటియా

యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ చేసుకునే ఈ బ్యూటీ అప్పట్లో ఓ సెన్సేషన్ గా మారింది.ఈ అమ్మాయి సాంగ్ లో అందానికి యువత పడిపోయింది.నేషనల్ క్రష్ గా మారిపోయింది.
సంజనా

ఈ బాలీవుడ్ బ్యూటీ తన అంతచందాలతో ఎందరివో మనసులు దోచి నేషనల్ క్రష్ గా ఎదిగింది.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మూవీ దిల్ బేచారాలో నటించింది.
సాక్షి మాలిక్

బూం డిగ్గి బూం బూం అనే పాటలో క్యూట్ స్టెప్పులు వేసి ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యింది.
ప్రియా ప్రకాష్ వారియర్

అప్పట్లో మలయాళం మూవీ కోసం చేసిన కన్ను గీటే సీన్ జనాల్లోకి ఓ రేంజిలో వెళ్లిపోయింది.ఆ దెబ్బతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
రష్మిక మందాన

తెలుగు, కన్నడ సినిమాల్లో పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటికి ఎంతో మంది పడిపోయారు.నేషనల్ క్రష్ గా మార్చివేశారు.