అతని ముక్కులో ఏముందో చూసిన డాక్టర్... ఒక్కసారిగా ఆశ్చర్యం

కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.శరీరంగా అసంకల్పిత మార్పులు జరిగిన విషయం చాలా సంవత్సరాలు పాటు తెలియకుండా జరుగుతుంది.

 Tooth Growing Inside This Guy Nose-TeluguStop.com

అయితే ఇలాంటి మార్పులు గురించి తెలిసినపుడు వారితో పాటు సమాజం కూడా ఆశ్చర్యపోతుంది.చాలా అరుదుగా జరిగే అలాంటి సంఘటనలని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అలాంటి సంఘటన చైనాలో ఓ వ్యక్తికి ఎదురైంది.

అతని గురించి బయటకి వచ్చిన వార్తకి సమాజం కూడా ఆశ్చర్యపోతుంది. చైనాకు చెందిన ఝాంగ్ బిన్‌షెంగ్ కి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది.

మూడు నెలలుగా  ఈ పరిస్థితి మరింత తీవ్రం కావడంతో  భయపడిపోయాడు.  ముందు ఏదో శ్వాస సంబంధ సమస్య అనుకున్నాడు.

కానీ ఎందుకైన మంచిది అని హాస్పిటల్ కి వెళ్ళాడు.</br>

ముక్కులోంచి ఏదో కుళ్లిపోయిన వాసన వస్తోందని, ఊపిరి అందడం లేదని డాక్టర్ లకి చెప్పాడు.

 ఝాంగ్ ఎక్స్‌రే తీయించుకున్నాడు.అది చూసిన డాక్టర్లు షాకయ్యారు.

  దానికి కారణం అతని ముక్కులో  ఓ పన్ను పెరుగుతోంది.ఇలా జరగడం చాలా అరుదని డాక్టర్లు చెప్పారు.

   ఝాంగ్ పదేళ్ల వయసులో కిందపడినప్పుడు విరిగిన పన్ను అతని ముక్కులో చేరి పెరగడం ప్రారంభించిందని తేల్చారు.  చివరికి డాక్టర్లు అరగంట కష్టపడి ఆ పన్నును తొలగించారు.

దాని పొడవు ఒక సెంటీమీటరు వరకూ ఉందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube