టూల్‌కిట్‌ కేసులో దిశా రవికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. !!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టూల్‌కిట్ కేసులో ఎట్టకేలకు దిశా రవికి బెయిల్ లభించింది.అయితే జనవరి 26 వ తేదీన అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడానికి స్వీడిష్ పర్యావేరణ ఉద్యమకారిణి షేర్ చేసిన టూల్ కిట్ కారణమని నిఘా వర్గాలు అనుమానించి అరెస్ట్ చేశాయి.

 Delhi Court Grants Bail To Disha Ravi In 'toolkit' Case, Delhi Court, Disha Ravi-TeluguStop.com

అంతే కాకుండా దిశా రవి, నికిత జాకోబ్, షాంతను ములుక్ లు ఖలిస్థానీ గ్రూప్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు ఆరోపించారు.ఈ సందర్భంగా ఆ అంశం కోర్టు వరకు వెళ్లగా, జనవరి 26న చోటు చేసుకుకున్న హింసతో దిశా రవి దోషి అని తేల్చడానికి మీ వద్ద ఏ ఆధారాలు ఉన్నాయని, కుట్రకు సంబంధించిన విషయాలలో సందర్భోచిత సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోమని పేర్కొంటూ దిశా రవికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

అయితే రూ.లక్ష పూచీకత్తుపై ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.కాగా పలుమార్లు బెయిల్ పిటిషన్‌ను రిజర్వులో ఉంచిన కోర్టు.ఇరు వాదోపవాదాల అనంతరం దిశా రవి లాయర్ వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube