‘ఎన్టీఆర్‌’ను ఇంకా ఇంకా లేపేస్తున్నారుగా..!  

ఎన్టీ రామారావు బయోపిక్‌పై దర్శకుడు క్రిష్‌ రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో లుక్‌ విడుదల చేస్తూ, ఒక్కో పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ సినిమాపై ఆసక్తిని కలిగించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. భారీ అంచనాలున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రెండవ పార్ట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ శాతం ఎక్కువ ఉండేలా దర్శకుడు క్రిష్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

Too Much Expectations On NTR Biopic Movie-

Too Much Expectations On NTR Biopic Movie

ఎన్టీఆర్‌ సినీ జీవితాన్ని చూపించే క్రమంలో పలువురు స్టార్‌ హీరోయిన్స్‌ను ఈయన చూపించబోతున్నాడు. శ్రీదేవి, సావిత్రి, జయప్రద ముఖ్యమైన హీరోయిన్స్‌ను క్రిష్‌ తన సినిమాలో చూపించేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే శ్రీదేవి పాత్రను రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో చేయించిన దర్శకుడు క్రిష్‌ తాజాగా జయప్రద పాత్రకు తమన్నాను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తమన్నా కూడా ‘ఎన్టీఆర్‌’లో ఉండబోతుంది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఆ చిత్రీకరణలో త్వరలోనే తమన్నా జాయిన్‌ అయ్యే అవకాశం ఉంది.

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ అంటే ఏదో డాక్యూమెంటరీ టైప్‌ అన్నట్లుగా కాకుండా ‘మహానటి’ చిత్రం ఎలా అయితే ఉందో అలా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ దండిగా ఉండేలా దర్శకుడు క్రిష్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రతి పాత్ర విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుని, అద్బుతమైన స్క్రీన్‌ప్లే మరియు మంచి పాత్రలతో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు.

Too Much Expectations On NTR Biopic Movie-

‘ఎన్టీఆర్‌’ మొదటి పార్ట్‌ కథానాయకుడు జనవరి 9న సంక్రాంతి కానుకగా రాబోతుంది, రెండవ పార్ట్‌ ‘మహానాయకుడు’ అదే జనవరి 24న రిపబ్లిక్‌ డే సందర్బంగా వచ్చేందుకు సిద్దం అవుతుంది. రెండు పార్ట్‌లు కలిపి 100 కోట్ల వసూళ్లను సాధిస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది.