కరోనా విషయంలో యూకే సైంటిస్టు హెచ్చరిక.. ?

కంటికి కనిపించే శత్రువు కంటే కళ్లకు కనిపించని కరోనా చాలా ప్రమాదమైనదని ఇప్పటికే ప్రపంచానికి అర్ధం అయ్యి ఉంటుంది కావచ్చూ.సైబర్ నేరగాళ్లూ రూటు మార్చినట్లుగా ఈ వైరస్ కూడా కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటూ అప్డేట్ అవుతుంది.

 Covid 19, Tongue Symptom, Uk Professor, Warning,corona,white Spots ,tongue Infec-TeluguStop.com

అదీగాక కరోనాలో అరుదైన కొత్త లక్షణాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి.అసలు కరోనా సోకిందనే విషయం కూడా తెలియకుండా ఈ లక్షణాలు ఉంటున్నాయి.

ఈ కరోనా విషయంలో యూకే సైంటిస్టు, కింగ్ కాలేజీ లండన్ యూనివర్శిటీకి చెందిన జనెటిక్ ఎపిడిమోలాజిస్ట్ టిమ్ స్పెక్టార్, కరోనా సోకిన వారిలో దీని ప్రభావం నోరు, నాలుకపై కూడా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.దీనికి కోవిడ్ టంగ్ అని పేరు కూడా పెట్టారు.

ఇక కరోనా బాధిత వ్యక్తి నాలుకపై అసాధారణ స్థితిలో తెల్లని మచ్చలు ఏర్పడుతాయని, ఇలాంటి మచ్చలు కనిపిస్తే అది కరోనా అయి ఉండొచ్చునని ఆయన వెల్లడిస్తున్నారు.ఇలాంటి లక్షణాలు కనిపిస్తే సెల్ఫ్ ఐసోలేట్ కావడం మంచిదని సూచిస్తున్నారు.

ఇది చూడటానికి మౌత్ అల్సర్లు మాదిరిగానే కనిపిస్తాయని, ఇలాంటి అరుదైన లక్షణాలు ఐదుగురిలో ఒకరికి మాత్రమే కనిపించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube