' పట్నం 'కే కేసీఆర్ పట్టం ! రేపే మంత్రిగా ప్రమాణ స్వీకారం 

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM kcr )ఈ మధ్యకాలంలో అన్ని ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే బిఆర్ఎస్ తరఫున వచ్చే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించి అన్ని పార్టీలకు షాక్ ఇచ్చారు.

115 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.మిగిలిన వాటికి మరికొన్ని రోజుల్లో ముహూర్తాన్ని నిర్ణయించారు.

ఇక పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిన కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఆకస్మాత్తుగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్యాబినెట్ లో కొత్తగా పట్నం మహేందర్ రెడ్డి కి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు.రేపు ఉదయం 11:30 గంటలకు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగనుంది.వెంటనే పట్నం మహేందర్ రెడ్డి( Patnam Mahender Reddy ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

ఆర్థిక శాఖ మంత్రిగా గతంలో ఈటెల రాజేందర్ పనిచేశారు.

 ఆయనను మంత్రి పదవి నుంచి కేసీఆర్ ( CM kcr )భర్తరఫ్ చేయడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.అప్పటి నుంచి ఆ మంత్రి స్థానం ఖాళీగానే ఉంది.ఆస్థానం కోసం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు చాలామంది ప్రయత్నాలు చేసినా, అకస్మాత్తుగా కెసిఆర్ క్యాబినెట్ ను విస్తరించాలని నిర్ణయించుకుని పట్నం మహేందర్ రెడ్డికి ఆ పదవి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారట .18 మందికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఉంది.2014లో తెలంగాణ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ విస్తరణలో రవాణా మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి పనిచేశారు.కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

అయితే ఆయనకు రెండోసారి మంత్రి పదవి దక్కలేదు.

 దీనికి కారణం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ ( BRS party )లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి క్యాబినెట్ లో కేసీఆర్ అవకాశం ఇవ్వడంతో మహేందర్ రెడ్డి అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితోనే ఉంటున్నారు.ఆయన పార్టీ మారబోతున్నారనే హడావుడి కూడా అప్పట్లో జరిగింది. అయితే ఎన్నికల సమయంలో అనూహ్యంగా పట్నం మహేందర్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకోవడంతో ఆయన మరోసారి మంత్రి కాబోతున్నారు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు