కరోనా వైరస్ ఎఫెక్ట్ : రేపటి నుంచి సినిమా థియేటర్స్ బంద్... 

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఎంతగా కలకలం సృష్టిస్తుందో చెప్పనవసరం లేదు.ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపుగా 7కి పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు అధికారికంగా ప్రకటించారు.

 Tomorrow Onwards Movie Theaters Closed In Kerala For Coronavirus-TeluguStop.com

అంతేగాక మరి కొందరు ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం.అయితే ఈ కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు దేశంలోని పలు రంగాల పై పడింది.

ఇందులో ముఖ్యంగా సినిమా రంగంలో అయితే ఇప్పటికే పలు భారీ బడ్జెట్ చిత్రాలను కూడా వాయిదా వేస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం కేరళ రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది.

అయినప్పటికీ ప్రజలు భయాందోళనలకు గురవుతుండటంతో రేపటి నుంచి ఈ నెల 31వ తారీకు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సినిమా థియేటర్లను మూసి వేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.అంతేగాక ఈ నిర్ణనయానికి పలు సినిమా నిర్మాణ సంస్థలు కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

 అయితే ఈ మధ్య కాలంలో ఈ కరోనా వైరస్ జనాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో వ్యాప్తి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.అంతేకాక ఇప్పటికే పలు రద్దీ ప్రాంతాల్లో కూడా ప్రజలని ఎక్కువగా సంచరించ వద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

Telugu Kerala, Kollywood, Theaters Kerala, Theaterskerala, Tomorrowonwards-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే దాదాపుగా పలు రంగాలకు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.ఇప్పటికే కొన్ని సంస్థలైతే తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కూడా కనిపిస్తున్నాయి.  ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తూ ఓ వీడియోని కూడా ప్రభుత్వ అధికారులు విడుదల  చేశారు.ఈ వీడియోలో విజయ్ దేవరకొండ కరోనా వైరస్ సోకకుండా తెసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube