రేపు సూర్య గ్రహణం.. గ్రహణ సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసా?

Tomorrow Is A Solar Eclipse Do You Know What To Do And What Not To Do

సాధారణంగా అమావాస్య పౌర్ణమి సమయాలలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడటం సర్వసాధారణం.అయితే కొన్నిసార్లు ఏర్పడిన సూర్య చంద్ర గ్రహణాల ప్రభావం కొన్ని చోట్ల ఉంటే మరికొన్ని చోట్ల ఆ ప్రభావం ఉండదు.

 Tomorrow Is A Solar Eclipse Do You Know What To Do And What Not To Do-TeluguStop.com

ఈ క్రమంలోని ఈ ఏడాది చివరి సూర్యగ్రహణడిసెంబర్ 4 శనివారం రానుంది.అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం భారత దేశంలో ఎక్కడా కనిపించకపోయినప్పటికీ,పండితులు మాటప్రకారం ఈ గ్రహణ ప్రభావం ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది కనుక ఈ గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరమని తెలిపారు.

డిసెంబర్ 4వ తేదీ ఏర్పడే సూర్య గ్రహణం దక్షిణాఫ్రికా ,దక్షిణఅమెరికా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలలో కనబడుతుంది.ఈ క్రమంలోనే డిసెంబర్ 4వ తేదీ శనివారం సూర్యగ్రహణఉదయం 10:59 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 03:07 గంటలకు ముగుస్తుంది.కనుక ఈ సమయంలో ఎవరూ కూడా ఏవిధమైనటువంటి నూతన పనులను ప్రారంభించకూడదు.అదేవిధంగా ఆహార పదార్థాలను తయారుచేయడం తినడం నిషేధం.అలాగే గ్రహణ సమయంలో తల దువ్వడం, నిద్ర పోవడం లేదా పదునైన వస్తువులను ఉపయోగించడం వంటివి చేయకూడదు.అలాగే గ్రహణం ఉన్న సమయంలో ఆహార పదార్థాలలో నీటిలో గరిక లేదా తులసి ఆకులను వేయాలి.

 Tomorrow Is A Solar Eclipse Do You Know What To Do And What Not To Do-రేపు సూర్య గ్రహణం.. గ్రహణ సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Hindu, Solar Eclipse, Surya Grahanam, Tomorrow, Worship-Movie

గ్రహణం అనంతరం శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి.ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం గంగాజలంతో శుద్ధి చేయాలి.అనంతరం ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆహార పదార్థాలను తయారు చేసుకొని భోజనం చేయాలి.

#Hindu #Tomorrow #Surya Grahanam #Solar Eclipse #Worship

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube