రేపే 'మహా' బలపరీక్ష,సిద్దమౌతున్న ఫడ్నవీస్

మహారాష్ట్ర లో గత నెల రోజులకు పైగా నెలకొన్న రాజకీయ పరిణామాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.మహారాష్ట్ర లో బీజేపీ,ఎన్సీపీ నేత అజిత్ పవార్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

 Tomorrow Fadnavis Is Facing Majority In Assembly-TeluguStop.com

అయితే రాత్రికి రాత్రి చోటుచేసుకున్న ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి తీరును తప్పుపడుతూ మిత్ర పక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించడం తో కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.గవర్నర్ ఈ నెల 30 వరకు ఫడ్నవీస్ ప్రభుత్వానికి గడువు నివ్వగా కోర్టు మాత్రం రేపే అనగా నవంబర్ 27 వ తేదీన బలపరీక్ష నిర్వహించి తన బలాన్ని నిరూపించుకోవాలని తేల్చి చెప్పింది.

దీనితో ఫడ్నవీస్ ప్రభుత్వం రేపే బలపరీక్షను ఎదుర్కోనుంది.రేపు సాయంత్రం 5 గంటల లోపు ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీ లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ఓపెన్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నిక జరగాలంటూ కోర్టు స్పష్టం చేసింది.జస్టిస్ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ ఓటింగ్ ను రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం లేదని,లైవ్ కవరేజి ద్వారా నిర్వహించాలంటూ స్పష్టం చేసింది.288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించగా.శివసేన 56 సీట్లు గెలిచింది.

ఎన్సీపీ 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి.

అయితే శివసేన ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేయడం తో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లో బీజేపీ విఫలమైంది.అయితే బీజేపీకి 11 మంది ఇండిపెండెంట్ల మద్దతు ఉండగా, ఇంకా 29 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది.

అయితే ఎన్సీపీ నుంచి బయటకు వచ్చిన అజిత్ పవార్ తనకు 36 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రకటించారు.

Telugu Bjp Siva Sena, Bjp Fadnavis, Fadnavis, Maharastra, Siva Sena Ncp-

మరి ఒకవేళ అజిత్ పవార్ చెప్పినట్లు అంతమంది మద్దతు గనుక బీజేపీ కి అందితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అన్నమాట.మరోపక్క శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు కలిపి 144 మంది సభ్యుల బలం ఉంది.కొందరు ఇండిపెండెంట్లు కూడా ఎన్సీపీకి సపోర్ట్ ఇస్తున్నారు.అందువల్ల ఆ కూటమి ప్రభుత్వం గట్టెక్కే ఛాన్స్ ఉంటుంది.కానీ… ఎన్సీపీలో రెబెల్స్ అందుకు సపోర్ట్ చేస్తారా అన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం.దీనిపైనే అక్కడ ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్న విషయం అర్ధం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube