చరిత్ర‌లో తొలిసారి అంత రేటు ప‌లికిన టొమాటో

ప్ర‌స్తుతం నిత్య‌వ‌స‌రాల రేట్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చూస్తున్నాం.మ‌రీ ముఖ్యంగా వంటింట్లో వాడే స‌రుకుల రేట్లు అయితే ఆకాశాన్ని తాకుతున్నాయి.

 Tomato High Rate For The First Time In History-TeluguStop.com

ఇప్ప‌టికే గ్యాస్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి. ఇక ప‌ప్పులు, ఉల్లిగ‌డ్డ‌ల రేట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి.

ఇప్పుడు వీటితో టొమాటో కూడా పోటీ ప‌డుతోంది.వీట‌న్నింటినీ వెన‌క్కు నెట్టి ముందు వరుస‌లో దూసుకుపోయేందుకు టొమాటో రెడీ అయిపోయింది.

 Tomato High Rate For The First Time In History-చరిత్ర‌లో తొలిసారి అంత రేటు ప‌లికిన టొమాటో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు దాని రేటు ఆకాశాన్ని తాకేలా ఉంది.టొమాటో అంటే మ‌నం నిత్యం కూర‌ల్లో వాడే వాటిల్లోల మొద‌టి స్థానంలో ఉండే కూర‌గాయ‌.

ప‌ప్పు ద‌గ్గ‌రి నుంచి మొద‌లు పెడితే అన్ని కూర‌ల్లోనూ కామ‌న్ గా వేసేది టొమాటో మాత్ర‌మే.మ‌రి అంత‌లా దీని రేటు పెరిగితే వాడేది ఎలా అని స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

నిజానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగానే టొమాటో పంట‌లు వేస్తున్నా కూడా ఈ స్థాయిలో రేట్లు పెర‌గ‌డం ఇదే మొద‌టిసారి.గ‌త చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి.

అంతెందుకు రెండు రాష్ట్రాల్లో కెల్లా అత్య‌ధికంగా టొమాటోను పండించే చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో కూడా ఇప్పుడు విప‌రీత‌మైన రేట్లు ఉన్నాయి.

Telugu Tomato, Tomato High Rate For The First Time In History, Viral News-Latest News - Telugu

ఇంత పెద్ద ఎత్తున టొమాటోలు పండించే మదనపల్లి మార్కెట్లోనే ఏకంగా కిలోకు రూ.104 ఉందంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.అది కూడా రైతుల ద‌గ్గ‌రి నుంచే హోల్ సేల్ వ్యాపారులు ఈ రేటు పెట్టి కొన్నారు.

అంటే ఇంక ప్ర‌జ‌ల‌కు ఇంకెంత రేటులో అమ్ముతారో అర్థం చేసుకోవ‌చ్చు.అస‌లు వంద రూపాయ‌ల‌కు ఏకంగా బాక్సు టమోటాలు వచ్చేవి.కానీ ఇప్పుడు కిలో కూడా రావ‌ట్లేదు.ఇక తెలంగాణ‌లో మ‌రింత రేటు పెర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్పుడు విస్తారంగా కురుస్తున్న వ‌ర్షాల‌కు ఏపీలో కూడా టొమాటో బాగానే దెబ్బ తిన్న‌ది.మ‌రి రాబోయే రోజుల్లో ఇంకెంత పెరుగుతాయో చూడాలి.

#Tomato History #Tomato

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube