ఒక్క సీన్ కోసం 19 కోట్లు… ఊహించని సాహసం చేసిన హీరో  

Tom Cruise performs death-defying motorcycle stunt, Hollywood, Bollywood, Dangerous Stunts, Mission Impossible Series, Tom Cruise - Telugu @tomcruise, Bollywood, Dangerous Stunts, Hollywood, Mission Impossible Series, Tom Cruise, Tom Cruise Performs Death-defying Motorcycle Stunt

హాలీవుడ్ లోయాక్షన్ సన్నివేశాలు అన్ని కూడా గ్రాఫిక్స్ లో గ్రీన్ మ్యాట్ లో షూట్ చేస్తారు.ఒక వేళ రియల్ గా చేయాల్సి వచ్చినా కూడా వాటి కోసం డూప్ లు ఉంటారు.

TeluguStop.com - Tom Cruise Performs Death Defying Motorcycle Stunt

ప్రమాదకర సన్నివేశాలు అన్ని కూడా డూప్ లతోనే చేస్తారు.అయితే కొంత మంది హాలీవుడ్ స్టార్స్ మాత్రం ఎలాంటి ప్రమాదకర సన్నివేశాలు అయినా డూప్ లేకుండా తామే చేసేస్తారు.

అలా చేసే వారిలో ఎక్కువగా వినిపించే పేరు టామ్ క్రూజ్.మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితం అయిన ఈ హీరో తన సినిమాలలో ఎక్కువగా రియల్ స్టంట్స్ చేస్తాడు.

TeluguStop.com - ఒక్క సీన్ కోసం 19 కోట్లు… ఊహించని సాహసం చేసిన హీరో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అలాగే ఏవైనా కాస్తా హై ఇంటెన్సన్ సన్నివేశాలు ఉన్నా కూడా వాటిని తానే చేస్తాడు.ఇప్పుడు అలాంటి సన్నివేశం చేసి మరో సారి ఔరా అనిపించుకున్నాడు.

మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.ఈ సినిమాలో ఏకంగా 19 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి ఒక సీన్ షూట్ చేశారు.

ఈ సీన్ లో ప్రాణాలకి తెగించి సాహసం చేసి అబ్బురపరిచారు.

నార్వేలో తీసిన ఈ సీన్ లో భాగంగా మోటార్ సైకిల్ పై స్పీడ్ గా వస్తూ కొండలపై నుండి బండితో సహా లోయలోకి దూకాలి.

ఆ సమయంలో పారాషూట్ ఓపెన్ చేసుకుని సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి.ఇలాంటి సన్నివేశాలు చాలా వరకు గ్రాఫిక్స్ పెట్టి పూర్తి చేస్తారు.అయితే టామ్ క్రూజ్ మాత్రం ఈ స్టంట్ రియల్ గా చేయడానికి ప్రయత్నం చేశాడు.చిత్ర యూనిట్ వద్ధని చెప్పినా కూడా వారిని ఒప్పించి ఈ సన్నివేశం రియాలిటీగా వచ్చేలా చేశాడు.

ఈ సీన్ షూట్ చేసే క్రమంలో ఏ మాత్రం అదుపు తప్పిన ప్రాణాల మీదకి వస్తుందని తెలిసిన టామ్ క్రూజ్ మాత్రం ఆ అసాధ్యన్ని సుసాధ్యం చేశారు.మరోసారి అబ్బురపర్చే స్టంట్ తో మెస్మరైజ్ చేశాడు.

ఆరు పదుల వయసుకు దగ్గర పడ్డ టామ్ క్రూజ్ ఇలాంటి సాహసాలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

#TomCruise #@TomCruise #Hollywood #Tom Cruise

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tom Cruise Performs Death Defying Motorcycle Stunt Related Telugu News,Photos/Pics,Images..