హీరో సాహసం.. 2 వేల అడుగుల ఎత్తు నుండి డూప్ లేకుండా స్టంట్!

Tom Cruise Hangs Upside Down From The Wing Of A Vintage Biplane For Insane Mission Impossible Stunt

మాములుగా హీరోలు డూప్ లేకుండా కష్టమైన స్టంట్ లు చేయడానికి సాహసించరు.ఎవరో ఒకరిద్దరు హీరోలు మాత్రమే స్టంట్ లు చేయడానికి రెడీ అవుతారు.

 Tom Cruise Hangs Upside Down From The Wing Of A Vintage Biplane For Insane Mission Impossible Stunt-TeluguStop.com

ఎందుకంటే ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ లు చేస్తే ప్రాణానికే ప్రమాదం.కొద్దిగా అటు ఇటు అయినా కూడా ప్రాణాలు కోల్పోవచ్చు లేదంటే తీవ్ర గాయాల పాలు అవ్వవచ్చు.

అందుకే ఎక్కువగా సినిమాల్లో హీరోలు కష్టమైన స్టంట్ లు చేయాలంటే ఖచ్చితంగా డూప్ యూస్ చేస్తారు.

 Tom Cruise Hangs Upside Down From The Wing Of A Vintage Biplane For Insane Mission Impossible Stunt-హీరో సాహసం.. 2 వేల అడుగుల ఎత్తు నుండి డూప్ లేకుండా స్టంట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఒక హీరో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా చేసాడు.

ఎంతో కష్టమైన స్టంట్ ను అవలీలగా డూప్ లేకుండా చేసేసాడు.కానీ ఈ స్టంట్ ఎలా చేసాడో తెలిస్తే మాత్రం మన ఒళ్ళంతా చెమటలు పట్టేయడం ఖాయం.

రెండు వేల అడుగుల ఎత్తు నుండి డూప్ లేకుండా స్టంట్ చేసాడు.ఇంతకీ ఇలా డూప్ లేకుండా స్టంట్ చేసిన హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారా.

హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ తన సూపర్ హిట్ సినిమా అయినా ‘మిషన్ ఇంపాజిబుల్” సినిమాకు సీక్వెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు.ఈ సీక్వెన్స్ అన్ని కూడా భారీ హిట్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాల్లో రిస్కీ స్టంట్ లు చాలానే ఉంటాయి.ఇక టామ్ ఇప్పటి వరకు తన సినిమాల్లో దాదాపు చాలా వరకు డూప్ లేకుండానే చేసాడు.

కొన్నిటికి మాత్రమే డూప్ ను ఉపయోగించు కున్నాడు.

ఇక తాజాగా మిషన్ ఇంపాజిబుల్ 8‘ సీక్వెన్స్ లో కూడా చాలా ఫీట్స్ చేయాల్సి ఉంది.ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ సినిమా కోసం టామ్ ఒక సాహసమైన స్టంట్ చేసాడు.

రెండు వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతుండగా దాని కాక్ పిట్ లో నుండి బయటకు వచ్చి విమానం రెక్కపై కుర్చీని ఆ తర్వాత విమానం రెక్క పట్టుకుని తలక్రిందులుగా వేలాడాడు.

ఆ సమయంలో విమాన పైలెట్ ఆ విమానాన్ని పల్టీ కొట్టించడంతో టామ్ తలక్రిందులైన విమానం రెక్కపై కుర్చునట్టు కనిపిస్తుంది.

ఇక ఇదంతా పక్కన మరొక విమానం నుండి షూట్ చేసారు.ఇంత రిస్కీ స్టంట్ డూప్ లేకుండా తీయడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఈయన ధైర్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు.అయితే ఈయన ఇంతకముందు కూడా చాలా స్టంట్ లు డూప్ లేకుండానే చేసాడు.

#Stunt #Vintage Biplane #Hollywood #Tom Cruise #Stunt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube