సావిత్రి తన జీవితంలో తన పిల్లల గురించి కూడా ఆలోచించలేదు...

అప్పట్లో గొల్లపూడి మారుతి రావు ప్రధాన పాత్రలో నటించినటువంటి “సంసారం ఒక చదరంగం” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు నెలకొల్పడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయింది.

 Senior Actress Shavukaru Janaki Got Emotional About Veteran Actress Savitri , To-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో పని మనిషి చిలకమ్మ పాత్రలో నటించినటువంటి షావుకారు జానకి తన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేస్తూ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అయితే ఇటీవలే షావుకారు జానకి ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఇందులో భాగంగా తన సినీ జీవితంలో చోటు చేసుకున్న  కొన్ని సంఘటనలను తెలుగు ప్రేక్షకులకు తెలిపింది.

అయితే ఇందులో అలనాటి అందాల తార మరియు విలక్షణ నటి సావిత్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

అంతేగాక అప్పట్లో నటి సావిత్రి తాను మంచి స్నేహితులని చెప్పుకొచ్చింది.అంతేకాక చీరలు, నగల విషయంలో కూడా ఇద్దరి అభిరుచులు ఒకే లాగా ఉండేవని, కానీ తామంటే గిట్టని కొందరు తమ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని ప్రచారం చేశారని, తమ గురించి తెలిసినవారు అవన్నీ నమ్మలేదని కొట్టిపారేశారు.

అయితే అలా కొంతకాలం గడిచిన తర్వాత ఇద్దరూ తమ సినీ జీవితాల్లో బిజీ అయ్యామని అందువలన తరచూ కలవడం కుదరలేదని చెప్పుకొచ్చింది.

అయితే తన గురించి ఒకానొక సమయంలో తెలిసినటువంటి కొన్ని వార్తల ఆధారంగా ఆమెను చూడడానికి తన ఇంటికి వెళ్లానని దీన పరిస్థితుల్లో ఉన్నటువంటి సావిత్రిని చూసి తనకు కన్నీళ్లు అగలేదని అన్నారు.

అంతేగాక సావిత్రి కూడా తనని చూసి ఏడ్చారని తెలిపింది.అలాగే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసినటువంటి సావిత్రి తన పిల్లల గురించి ఎందుకు ఆలోచించలేకపోయిందో అని ఇప్పటికీ చాలా బాధ పడుతూనే ఉంటానని తెలిపింది.

అయితే వయసు మీద పడడంతో ప్రస్తుతం షావుకారు జానకి అడపాదడపా సినిమాల్లో అమ్మమ్మ, నానమ్మ పాత్రల్లో కనిపిస్తోంది.అలాగే పలు రకాల తెలుగు సీరియల్ ధారావాహికలో కూడా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube