స్టార్ హీరోయిన్లకు చుక్కలు చూపిస్తున్న కొత్త హీరోయిన్లు వీళ్లే?

సినిమా రంగంలో ప్రతిభావంతులైన వాళ్లకు వరుసగా అవకాశాలు వస్తూనే ఉంటాయి.ఒకవైపు రష్మిక, పూజా హెగ్డేలకు స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తుంటే మరోవైపు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లకు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి.

 Tollywood Young Heroines Got Continuos Chances In Movies Details, Continuous Cha-TeluguStop.com

సక్సెస్ సాధిస్తున్న కొత్త హీరోయిన్లకు తమ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.అలా ఈ మధ్య కాలంలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్లలో కృతిశెట్టి ఒకరు.

ఉప్పెనతో టాలీవుడ్ కు పరిచయమైన కృతికి చేతిలో ఊహించని స్థాయిలో ఆఫర్లు ఉన్నాయి.నాని, నాగచైతన్య, సుధీర్ బాబు, రామ్, నితిక్ కు జోడీగా వేర్వేరు సినిమాలలో కృతి నటిస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు కృతిశెట్టి చేతిలో ఒక తమిళ మూవీ ఉంది.సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మీనాక్షి చౌదరి ఖిలాడి, హిట్ 2 సినిమాలలో నటిస్తున్నారు.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ, సలార్ లో మీనాక్షి పేరును పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Telugu Kethika Sharma, Kruthi Shetty, Raviteja, Romantic, Tollywood, Young-Movie

పెళ్లిసందడి సినిమాలో తన లుక్స్ తో ప్రేక్షకులను శ్రీలీల ఆకట్టుకుంది.తన డ్యాన్స్ తో శ్రీలీల ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసింది.రవితేజ ధమాకా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీలకు యంగ్ హీరోల సినిమాల్లో కూడా ఛాన్స్ లు దక్కినట్టు ప్రచారం జరుగుతోంది.

రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ కు కేతిక శర్మ పరిచయమయ్యారు.

Telugu Kethika Sharma, Kruthi Shetty, Raviteja, Romantic, Tollywood, Young-Movie

రొమాంటిక్ సినిమాలో గ్లామర్ షో ద్వారా కేతిక శర్మ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.త్వరలో రిలీజ్ కాబోతున్న నాగ శౌర్య లక్ష్య మూవీలో కూడా కేతిక హీరోయిన్ కావడం గమనార్హం.త్వరలో కేతిక శర్మ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లతో పాటు యంగ్ హీరోయిన్లు కూడా సత్తా చాటుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube