ఈమె కూడా తెలుగు హీరోయిన్ మీకు తెలుసా..?  

Riddhi kumar, Tollywood young heroine, cine carrier news, lover movie heroine, - Telugu Cine Carrier News, Lover Movie Heroine, Riddhi Kumar, Tollywood Young Heroine

తెలుగులో ప్రముఖ దర్శకుడు అన్నీష్ కృష్ణ 2018 సంవత్సరంలో దర్శకత్వం వహించిన  “లవర్” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది. అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించగా హీరోయిన్ గా కేరళ బ్యూటీ రిద్దీ కుమార్ నటించింది.

TeluguStop.com - Tollywood Young Heroine Riddhi Kumar Cine Carrera News

అలాగే ఈ చిత్రంలో గాయత్రి భార్గవి, రాజీవ్ కనకాల, సుబ్బరాజు, అజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి రిద్దీ కుమార్ మాత్రం ఎందుకో కొత్త సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో విఫలమవుతోంది.

TeluguStop.com - ఈమె కూడా తెలుగు హీరోయిన్ మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీనికి తోడు ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన టువంటి “అనగనగా ఓ ప్రేమ కథ” అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అంతేగాక ఈ చిత్రం విడుదలైనట్లు కూడా ఇప్పటికీ చాలామందికి తెలియదు.

చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం, నటనా ప్రతిభ ఉన్నటువంటి రిద్ధి కుమార్ తాను నటించినటువంటి చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడమే ఆమె సినీ అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమువుతోందని ముఖ్య కారణమని కొందరు సినీ క్రిటిక్స్ అంటున్నారు.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో  షూటింగులు లేక ఇంటిపట్టునే ఉంటోంది.

అంతేగాక పలు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.

 కాగా అప్పుడుడప్పుడూ పలురకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ ఫోటోలని తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది.

దీంతో కొందరు నెటిజన్లు ఆమె ఫోటోలపై స్పందిస్తూ హీరోయిన్ కి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఆమె నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి ఇప్పటికీ సరైన అవకాశం రాక గుర్తింపు కి నోచుకోలేక పోయిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరికొంతమంది ఆమె అభిమానులు కనీసం ఇప్పటికైనా టాలీవుడ్ దర్శక, నిర్మాతలు రిద్దీ కుమార్ కి నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు.

 మరి తమ అభిమాన నటి కోసం ఫ్యాన్స్ చేస్తున్నటువంటి రిక్వెస్ట్ కి తెలుగు సినీ దర్శకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

#LoverMovie #TollywoodYoung #Riddhi Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Young Heroine Riddhi Kumar Cine Carrera News Related Telugu News,Photos/Pics,Images..