పెళ్లిని వాయిదా వేసుకున్న నితిన్…..  

Tollywood Young Hero Nitin Postponed His Marriage - Telugu Nitin Birthday Celebrations News, Nitin Postponed His Marriage, Tollywood Young Hero Nitin Marriage News, Tollywood Young Hero Nitin News,

టాలీవుడ్ లో విపత్తుల సమయంలో తనకు తగిన సాయం చేస్తూ యంగ్ హీరో నితిన్ అండగా నిలుస్తున్నాడు.హీరో నితిన్ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.

 Tollywood Young Hero Nitin Postponed His Marriage

అంతేగాక మరో రెండు కొత్త చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు.అయితే తాజాగా నితిన్ తన పుట్టిన రోజు వేడుకలు మరియు పెళ్లి తేదీపై అధికారిక ప్రకటనను విడుదల చేశాడు.

ఇందులో భాగంగా ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కలకలం సృష్టిస్తుండంతో తన పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు తెలిపాడు.అలాగే తన పుట్టిన రోజు వేడుకలను కూడా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జరుప వద్దంటూ తన అభిమానులకు సూచించాడు.

పెళ్లిని వాయిదా వేసుకున్న నితిన్…..-Latest News-Telugu Tollywood Photo Image

అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ పరిస్థితులు ఉండటంతో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరాడు. ఇలా చేయడం వల్ల దేశానికి ఎంతో మేలు చేసిన వారవుతారని తెలిపాడు.

అయితే ఈ నెల 30వ తారీఖున పుట్టిన రోజు వేడుకలను నితిన్ అభిమానులు ఘనంగా జరిపేందుకు కొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అందువల్లనే ఈ విషయం తెలుసుకున్న టువంటి నితిన్ తన పుట్టిన రోజు వేడుకలు జరప వద్దంటూ అధికారికంగా తెలియజేశాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నితిన్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న టువంటి “రంగ్ దే” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో నితిన్ సరసన టాలీవుడ్ గ్లామర్ క్వీన్ కీర్తి సురేష్ జంటగా నటిస్తోంది.ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Young Hero Nitin Postponed His Marriage Related Telugu News,Photos/Pics,Images..