బాలీవుడ్ లో రాణిస్తున్న ఈ తెలుగు హీరో ఎవరో తెలుసా..?  

Tollywood young hero Harshvardhan Rane Bollywood movie offers, Harshvardhan Rane, Telugu hero, Tollywood young hero, Bollywood movie offers, Bollywood - Telugu @harsha_actor, Bollywood, Bollywood Movie Offers, Harshvardhan Rane, Telugu Hero, Tollywood Young Hero, Tollywood Young Hero Harshvardhan Rane Bollywood Movie Offers

తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు శ్రీ హరి నాను దర్శకత్వం వహించిన తకిట తకిట అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన యంగ్ హీరో హర్ష వర్ధన్ రానే గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వచ్చీ రావడంతోనే తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నా హర్ష వర్ధన్ రానే కి సినీ కుటుంబం బ్యాగ్రౌండ్ లేకపోవడంతో కొత్త సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో కొంతమేర తీవ్రంగా శ్రమించాడు.

TeluguStop.com - Tollywood Young Hero Harsaha Vardhan Rane Bollywood Movie Offers

దీంతో అప్పుడప్పుడు పలు చిత్రాలలో గెస్ట్ పాత్రలలో కూడా నటించాడు.

ఒక రకంగా చెప్పాలంటే హర్షవర్ధన్ తాను గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో నటించిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

TeluguStop.com - బాలీవుడ్ లో రాణిస్తున్న ఈ తెలుగు హీరో ఎవరో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో నటన పరంగా ఎంతో మంచి టాలెంట్ ఉన్నటువంటి హర్షవర్ధన్ రానే అవకాశాలు దక్కించుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాడు.కాగా 2016 సంవత్సరంలో బాలీవుడ్లో “సనం తేరి కసం” అనే చిత్రంలో హీరోగా నటించి బాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోగా పరిచయమయ్యాడు.

ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.దాంతో వరుస సినిమాలు నటించే అవకాశం దక్కించుకున్నాడు.

కాగా ప్రస్తుతం హిందీలో హర్ష వర్ధన్ రానే  “టైస్” అనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అలాగే ఇటీవలే హాసిన్ దిల్ రుబా అనే మరో కొత్త చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

కాగా తెలుగులో ప్రస్తుతం హర్ష వర్ధన్ రానే “బృందావనమది అందరిదీ” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

#@harsha_actor #TollywoodYoung #TollywoodYoung #BollywoodMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Young Hero Harsaha Vardhan Rane Bollywood Movie Offers Related Telugu News,Photos/Pics,Images..