తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది డైరెక్టర్లలో ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్లు( Young Directors ) చాలా వండర్స్ క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్లలో ఎవరెవరికి స్టార్ డైరెక్టర్లు( Star Directors ) అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం… ముందుగా ఈ లిస్టులో చందు మొండేటిని( Chandoo Mondeti ) తీసుకుంటే ఈయన కార్తికేయ 2 సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ సాధించాడు ఈయన ఆల్మోస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అయినప్పటికీ పెద్ద హీరోలు ఎవరు డేట్స్ ఇవ్వడం లేదు ఈయన ముందు ముందు స్టార్ హీరోలతో తీయాలంటే ఈయన ఒకటి రెండు సినిమాలతో భారీ హిట్లను సాధించాలి దాని కోసమే ఆయన కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ప్రస్తుతం నాగచైతన్య తో( Naga Chaitanya ) సినిమా చేస్తున్నారు…
ఇక ఈయన తర్వాత చెప్పుకోవాల్సిన మరో డైరెక్టర్ పరుశురాం( Director Parasuram ) ఈయన ఇప్పటికే స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు దాంతో విజయ్ దేవరకొండ తో ( Vijay Devarakonda ) ఇంకో సినిమా చేస్తున్నాడు.వీళ్ళ కాంబోలో ఇప్పటికే వచ్చిన గీత గోవిందం సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్టును సొంతం చేసుకుంది.
ఇక ఆ దిశలోనే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని పరశురాం మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.

అయితే ఇప్పటికే పరశురాం రవితేజ ,మహేష్ బాబు లాంటి పెద్ద హీరోలతో చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.దాంతో మరోసారి స్టార్ హీరోలు ఈయనకు అవకాశం ఇవ్వాలంటే ఈయన ప్రస్తుతం చేస్తున్న సినిమాతో తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలి అలా అయితేనే ఇతనికి స్టార్ హీరోలు డేట్ ఇస్తారు అయినా కూడా ఈయనకి స్టార్ డైరెక్టర్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి…

ఇక లిస్టులో ఉన్న మరో డైరెక్టర్ వెంకీ కుడుముల( Venky Kudumula ) ఈయన ఇప్పటికే ఛలో, భీష్మ అనే రెండు సినిమాలతో భారీ హిట్లను అందుకున్నాడు దాంతో చిరంజీవి గారితో( Chiranjeevi ) ఒక సినిమా ఉంటుంది అని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.అయినప్పటికీ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు.దాంతో మరోసారి నితిన్ తో( Nithin ) సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోగలిగితే ఈయనకి స్టార్ హీరోల నుంచి అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది.ఈయన కూడా పెద్ద డైరెక్టర్ అవుతాడు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు…
.