ఈ వెటరన్ తెలుగు హీరోయిన్ చెల్లెలు కూడా స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన వెటరన్ హీరోయిన్ నగ్మా గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈమె అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున తదితర స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే మెప్పించింది.

 Actress Nagma Sister Heroine Jyothika News,nagma, Tollywood Yesteryear Heroine,-TeluguStop.com

అయితే సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత రాజకీయాల్లోకి చేరి నగ్మా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది.

అయితే హీరోయిన్ నగ్మా చెల్లెలు కూడా తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుందని ఇప్పటికీ చాలా మందికి తెలియదు.

అయితే ఆమె చెల్లెలు ఎవరో కాదు తమిళ హీరోయిన్ జ్యోతిక.ఈమె కూడా దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది.అంతేగాక నగ్మా కి రోషిణి అనే మరో చెల్లెలు కూడా ఉంది.  ఈమె సినిమాల్లో పెద్దగా పాపులర్ కాలేకపోయినా పలు ధారావాహికలలో నటించి బుల్లితెర మీద బాగానే అలరించి తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.

అయితే ఈ ముగ్గురు నటీమణులకు తల్లి ఒక్కటే కానీ తండ్రులు ఇద్దరు.కాగా సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత నటి నగ్మా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు పలు అవకాశాలు తలుపు తట్టినప్పటికీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల నగ్మా వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అంతేగాక 40 ఏళ్ల పైబడినప్పటికీ నటి నగ్మా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.ఇప్పటివరకు నటి నగ్మా తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదని విషయంపై స్పందించకపోవడంతో ఇప్పటికీ సరైన కారణాలు తెలియడం లేదు.

 అయితే జ్యోతిక మాత్రం పెళ్లయిన తర్వాత కూడా పలు చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube