Tollywood Story Writers: కథలు రాయాలంటే గోవా వెళ్ళక్కర్లేదు.. ఇక్కడే అంతకన్నా బెటర్ ప్లేసెస్ ఉన్నాయ్

ఒక సినిమా సక్సెస్ కావాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది కథ.ఒక్క కథ బాగుంటే మిగతా అన్ని కూడా సెట్ చేసుకోవచ్చు.

 Tollywood Writers Can Write Stories In Hyderabad Details, Tollywood Story Writer-TeluguStop.com

కథ మాత్రమే సినిమాకు హీరో.అందుకే ఏదైనా సినిమా ఫ్లాప్ అయినా కూడా సరైన కథల ఎంపిక చేయలేదు అంటారు.

అంతే కాదు ఎవరైనా హీరో వరస పరాజయాల్లో ఉంటె కథల ఎంపికలో తప్పటడుగులు అని చాల సింపుల్ గా చెప్పేస్తారు.అందుకే కథనే ప్రతి సినిమాకు హీరో.

ఆ తర్వాతే కథనం, హీరో మరియు మిగతా కాస్టింగ్.అందుకే కథ విషయంలో చాల జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.

అలాంటి మంచి కథ రావాలంటే అంతే బాగా రాసే రైటర్స్ ఉండాలి.

ఇక టాలీవుడ్ లో ఉన్న 12 కథలను అటు తిప్పి ఇటు తిప్పి రాస్తున్నారు అనే వాళ్ళు ఉన్నారు.

ఆ సంగతి పక్కన పెడితే కథ గురించి ఇంత డిస్కషన్ ఎందుకు అనే కదా మీ అనుమానం.అదే విషయంలోకి వస్తున్నాను.ఒక సినిమాకు కథ రాయాలంటే రైటర్స్ చాల మంది మంచి ప్లేస్, టైం అంటూ ఉంటారు.అలాంటి ప్రశాంత వాతావరణంలో రాస్తేనే కథ బాగా వస్తుంది అని బలంగా నమ్ముతారు.

పూరి జగన్నాద్ లాంటి దర్శకులు అయితే గోవా లాంటి ప్రదేశాల్లో ఒంటరిగా కూర్చొని కథలు రాయడానికి ఇష్టపడతారు.ఒక్క పూరి మాత్రమే కాదు టాలీవుడ్ లో చాల మంది ఇప్పుడు అలాగే చేస్తున్నారు.

మరి అంత చేసిన ఏంటి ఇలాంటి సినిమాలు అని మాత్రం అడగకండి.

Telugu Puri Jagannath, Directors, Hyderabad, Story Writers, Story, Tollywoodstor

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సిటీ చుట్టూ ఈ మధ్య కొన్ని విశాలమైన ప్రదేశాలు పుట్టుకాస్తున్నాయి.మంచి బంగ్లా ఉండి, అందుకు తగ్గ గార్డెన్ తో ఉండి చాల విశాలంగా కట్టడాలు వెలుస్తున్నాయి.ఇలాంటి ప్లేసెస్ ని పార్టీ ల కోసం, ఈవెంట్స్ కోసం, సినిమా షూటింగ్ ల కోసం రెంట్ కి ఇస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఒంటరిగా కూర్చొని కథలు రాయడానికి కి కూడా గోవా కన్నా అందంగా ఆ స్థలాలను తీర్చి దిద్దుతున్నారు.సో ఇంకెందుకు ఆలస్యం.ఇక కథలు రాయాలంటే ఎక్కడికో ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు.మన హైదరాబాద్ చుట్టుపక్కలే గోవా కన్నా మంచి ప్రదేశాలు ఉన్నాయ్.

హ్యాపీ గా కూర్చొని కథలు రాసి హిట్స్ కొట్టండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube