Paruchuri Gopala Krishna God Father : గాడ్ ఫాదర్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ.. అలాంటి సినిమాలు చిరుకు సెట్ కావంటూ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Paruchuri Gopala Krishna Review On Chiranjeevi God Father Movie,chiranjeevi,god-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.

దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు కలెక్షన్ ల వర్షం కురిపించింది.ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ లు కీలకపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా పై టాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలుగులో ఈ సినిమా బాగుంది.

పేరుకు మలయాళ రీమిక్స్ సినిమా అయినప్పటికీ తెలుగు రాజకీయాన్ని ఈ సినిమాలో పరిచయం చేశారు.అయితే మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో ఉంచుకొని మాత్రమే నేను ఈ విషయాన్ని చెబుతున్నాను.

ఇందులో కథ చాలా స్లో ప్లేస్ లో వెళ్ళింది.చిరంజీవికి స్లో కథనం అనేది సరిపోదు.

ఈ సినిమాలో ఇంకా మార్పులు చేయాల్సింది.స్లో ప్లేస్ తో మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కు తగిన క్యారెక్టర్ కాదు.

సినిమా విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.కానీ చిరంజీవి డాన్స్ పాట లేని సినిమా కాస్త ఇబ్బందిగా అనిపించింది.

Telugu Acharya, Chiranjeevi, God, God Revieww, Nayantara, Paruchurigopala, Salma

అలాగే ఈ సినిమాలో షఫీ పాత్రలో సునీల్ ఉండి ఉంటే ఇంకా బాగా ఉండేదేమో అనిపించింది అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.అలాగే సల్మాన్ ఖాన్ ఈ సినిమాకు ఒకరకంగా ప్లేస్ మరొకరకంగా మైనస్ అని చెప్పవచ్చు.ఎందుకంటే మెగాస్టార్ నడుస్తుంటే సల్మాన్ ఖాన్ ఫైట్ చేయడం ఫాన్స్ కు బాధ కలిగించింది.ఆచార్య సినిమా మాదిరిగానే ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ ని లేదంటే పవన్ కళ్యాణ్ ని తీసుకొని ఉంటే ఈ సినిమా మరొక రేంజ్ లో ఉండేది అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube