కేటీఆర్ సర్ సాయం చెయ్యండంటూ ప్రముఖ గేయ రచయిత కుమార్తె ఆవేదన?

ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన పాటలు ఈయన కలం నుంచి జాలువారిన ఈ విధమైన ప్రేక్షకాదరణ పొందాయి.

 Tollywood Writer And Lyricist Kandikonda Daughter Request To Ktr To Help, Kondik-TeluguStop.com

ఇలా ఎన్నో చిత్రాలకు అద్భుతమైన పాటలు రాసిన కందికొండ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకపోవటం వల్ల ఆయన కుటుంబానికి సహాయం చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కందికొండ కూతురు మాతృక కేటీఆర్ కు లేఖ రాశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ కు ఆమె లేఖ రాస్తూ డియర్ కేటీఆర్ సార్ ఈ ఏడాది జూన్ లో మేము ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకొని మీరు మాకు సహాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.

మీరు చొరవ చూపడం వల్ల నాన్నగారి ఆరోగ్యం మెరుగు పడింది.అలాగే నాన్నకు వెన్నెముక సర్జరీ చేసే సమయంలో ఎంతో సహాయం చేశారు అందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇకపోతే నాన్న గారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారికి చిత్రపురి లో నివాసం కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను సహాయం కోరారు.

Telugu Kondikonda, Lyricist, Writter-Latest News - Telugu

ప్రస్తుతం అద్దే ఇంట్లో ఉంటున్న మేము చిత్రపురి కాలనీ లో సొంత ఇంటి కోసం నాలుగు లక్షల రూపాయలను చెల్లించాము.అయితే నాన్నగారి అనారోగ్యం కారణంగా మిగతా డబ్బులు చెల్లించలేక పోయామని అతని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రపురి కాలనీలో తమకు ఇల్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఈమె కేటీఆర్ కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.అలాగే ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా తమకు సహాయం చేయాలని లేఖ ద్వారా కోరారు.

మరి ఈమె ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube