సంక్రాంతి రచ్చ ముగిసింది.. ఇక సమ్మర్ హంగామా స్టార్ట్!

ఈ ఏడాది సంక్రాంతి పండుగ ఘనంగా ముగిసింది అనే చెప్పాలి.సంక్రాంతి పండుగ కానుకగా ఎప్పటి లాగానే ఈసారి కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది.

ఈసారి స్టార్ హీరోల సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి.2023 సంక్రాంతి కానుకగా మొత్తం నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి.టాక్ పరంగా నాలుగు సినిమాలు బాగానే రాగా కలెక్షన్స్ కూడా అదరగొడుతున్నాయి.

ఈ ఏడాది సంక్రాంతి విజేతగా వాల్తేరు వీరయ్య సినిమా నిలిచింది.మెగాస్టార్ నటించిన ఈ సినిమా 150 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేస్తుంది.

ఇక సంక్రాంతి రచ్చ ముగియడంతో త్వరలోనే సమ్మర్ హంగామా స్టార్ట్ కానుంది.ఈ ఏడాది సమ్మర్ లో కూడా భారీ సినిమాలు రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి.

మరి సంక్రాంతికి సీనియర్ స్టార్స్ బరిలోకి దిగి రచ్చ రచ్చ చేసారు.

Advertisement

ఇప్పుడు సమ్మర్ లో ఎవరు తమ సినిమాలతో రాబోతున్నారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ప్రెజెంట్ రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాలు ఏంటంటే.సమ్మర్ ముందు చిన్న చిన్న సినిమాలతో పాటు ఓ మోస్తరు సినిమాలు కూడా బరిలోకి రాబోతున్నారు.

సుధీర్ బాబు హంట్ సినిమాతో రాబోతుండగా.సమంత శాకుంతలం సినిమాతో రాబోతుంది.

హంట్ ఈ నెలలో రానుండగా.శాకుంతలం ఫిబ్రవరిలో రానుంది.శాకుంతలం సినిమాకు పోటీగా ధనుష్ సార్ సినిమాతో రాబోతున్నాడు.

ఆ తర్వాత వేసవి హంగామా స్టార్ట్ కానుంది.మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో పాటు రవితేజ రావణాసుర సినిమా, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా, నాని దసరా మూవీలు సమ్మర్ బరిలోనే రిలీజ్ కానున్నాయి.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

దీంతో ఈ భారీ సినిమాల కోసం టాలీవుడ్ మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు