సినిమా పరిశ్రమలో రంగులు మారినట్లుగా మనుషులు కూడా మారితేనే లైఫ్ లేకుంటే...

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి నటుడు నర్సింగ్ యాదవ్ గురించి తెలియని వారు ఉండరు.తెలంగాణ యాసలో మాట్లాడుతూ అటు విలనిజం అయినా సరే, ఇటు కామెడీ అయినా సరే ఏదైనా తనదైన శైలిలో తన పాత్రకి న్యాయం చేస్తుంటాడు నర్సింగ్ యాదవ్.

 Narsing Yadav, Tollywood Actor, Villain, Comedian, Tollywood, Movie Industry Lif-TeluguStop.com

అయితే ఇటీవల కాలంలో నర్సింగ్ యాదవ్ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొని సినీ పరిశ్రమలోని పరిస్థితుల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

చిత్ర పరిశ్రమల్లో పనిచేసేటువంటి ఆర్టిస్టులు లేదా దర్శక నిర్మాతలు తదితరులు ఎవరైనా సరే రంగులు మారినట్లు మనుషులు కూడా పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని  పరిస్థితులకనుగుణంగా మారుతుంటేనే చిత్ర పరిశ్రమలో మనుగడ ఉంటుందని లేకపోతే నెట్టుకు రావడం కష్టమేనని చెప్పుకొచ్చాడు.

ఇందుకు ఉదాహరణగా ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గురించి కూడా పలు అంశాలను వివరించాడు.అలాగే ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిందినటువంటి పలువురు దర్శక నిర్మాతలు ఇలా పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడంతో  తెరమరుగైపోయారని తెలిపాడు.

అంతేగాక ఓ దర్శకుడు లేదా నిర్మాత ఎంతో కష్టపడి సినిమా తీస్తే ఆ సినిమాని విడుదల చేయాలంటే ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా తెలిపాడు.

అయితే ఇలాంటి కారణాల వల్ల ప్రస్తుతం కొందరు సినిమా పరిశ్రమ నుంచి తరలి పోయి ఇతర వ్యాపారాల వైపు ఆసక్తి చూపుతున్నారని కూడా చెప్పుకొచ్చాడు.

అలాగే తనకు స్వర్గీయ నటి సౌందర్య అంటే ఎంతో అభిమానమని తెలిపాడు.తాను ఇప్పటి వరకు దాదాపుగా నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించానని మనం మరో రెండు వందల రెండు లేదా మూడు వందల చిత్రాల్లో కూడా నటించాలని ఉందని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube