భార్య చేతిలో మోసపోయిన టాలీవుడ్ విలన్ సాయి కుమార్..!

డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు సాయికుమార్ సింహ సినిమాలో విలన్ గా నటించి బాగా క్రేజ్ తెచ్చుకున్నారు.సాయి కుమార్ ప్రధానంగా మలయాళ చిత్రాల్లో నటిస్తారు.

 Tollywood Vilain Sai Kumar Cheated By His Own Wife-TeluguStop.com

ఆయన మలయాళ నటుడైన కొట్టారక్కర శ్రీధరన్ నాయర్ కి జన్మించారు.సాయికుమార్ తండ్రి శ్రీధరన్ 150 మలయాళ సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

ప్రముఖ నటి శోభ మోహన్ సాయి కుమార్ కి అక్క కాగా.విను మోహన్ అల్లుడు అవుతాడు.

 Tollywood Vilain Sai Kumar Cheated By His Own Wife-భార్య చేతిలో మోసపోయిన టాలీవుడ్ విలన్ సాయి కుమార్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా చూసుకుంటే సాయికుమార్ కుటుంబం నుంచి మొత్తం నలుగురు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు అని చెప్పుకోవచ్చు.

సాయి కుమార్ 1977 లో విడుదలయిన ‘విదరుణ మోత్తుకల్’ మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండి తెరకు పరిచయం అయ్యారు.మొదటిగా కమెడియన్ గా నటించిన ఆయన ఆ తర్వాత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు.2007లో విడుదలైన ‘ఆనందభైరవి‘ మూవీలో సాయికుమార్ కనబరిచిన నటనకు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు.ఈ మూవీలో బ్రహ్మాండంగా నటించినందుకు గాను ఆయనకు ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు దక్కింది.ఇంకా ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనా ప్రదర్శన చూపించి ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు.

అయితే సాయి కుమార్ మూవీ కెరీర్ సాఫీ గానే కొనసాగింది కానీ ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ముళ్ళ మీద నడకే అయింది.

సాయి కుమార్ డ్రామా ట్రూప్ లో చేరి నాటకాలు వేస్తున్న సమయంలో ఆయనకి ప్రసన్నకుమారి తో పరిచయం ఏర్పడింది.వీళ్లిద్దరూ కలిసి అనేక నాటకాల్లో హీరోహీరోయిన్లుగా నటించారు.అయితే వీరి మధ్య పరిచయం ప్రేమకు, ఆపై పెళ్ళికి కూడా దారి తీసింది.

అయితే పెళ్లి చేసుకున్న అనంతరం కొంతకాలం పాటు ప్రసన్నకుమారి, సాయికుమార్ ఎంతో అన్యోన్యంగా తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించారు.ఈ దంపతులకు వైష్ణవి అనే కూతురు కూడా జన్మించింది.

దీంతో ప్రసన్నకుమారి సినిమాలు మానేసి తన కూతురు ఆలనాపాలనా చూసుకోవడం ప్రారంభించారు.అయితే ఒకరోజు ఉన్నఫలంగా తన భార్య తనని మోసం చేసిందని మండిపడి కొచ్చి లోని ఒక అపార్ట్మెంట్ తీసుకొని సెపరేట్ గా జీవించడం ప్రారంభించారు.

Telugu Bindu Panicker, Malayalam Actor Sai Kumar, Prasanna Kumari, Sai Kumar Real Life News, Simha Villain Sai Kumar, Tollywood Villain Sai Kumar, Tollywood Villain Sai Kumar Cheated By His Own Wife-Telugu Stop Exclusive Top Stories

ప్రసన్నకుమారి వయసులో సాయి కుమార్ కంటే ఆరేళ్ళు పెద్దది అట.అయితే ఆ విషయం తెలిసిన సాయికుమార్ తీవ్ర నిరాశకు లోనయ్యారట.వయస్సు విషయంలోనే వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయట.అయితే ప్రసన్నకుమారి మాత్రం తన భర్త సాయి కుమార్ బిందు పనికిర్ అనే ఒక లేడీ కమెడియన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నారని తనని తన కూతురిని పట్టించుకోవడంలేదని చెప్పుకొచ్చారు.

ఈ విషయంలో వీళ్ళిద్దరికీ ఎన్నో గొడవలు అయ్యాయి.చివరికి సాయికుమార్ తన భార్యతో విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.దీంతో 2008లో కోర్టు సాయి కుమార్ మరియు ప్రసన్న కుమారి దంపతులకు విడాకులు మంజూరు చేసింది.2009వ సంవత్సరంలో సాయికుమార్ మలయాళీ కమెడియన్ బిందు పనికిర్ ను పెళ్లి చేసుకున్నారు.

#SimhaVillain #SaiKumar #MalayalamActor #Prasanna Kumari #Bindu Panicker

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు