ఈ విలన్ సినిమాల్లోకి రాకముందు నైట్ వాచ్ మెన్ గా కూడా పని చేశాడట....

తెలుగులో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించినటువంటి ఠాగూర్ చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు షియాజీ షిండే గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Tollywood Veteran Villain Sayaji Shinde Real Struggles News, Sayaji Shinde, tol-TeluguStop.com

అయితే ఒకప్పుడు తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న షియాజీ షిండే ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక  ఇబ్బంది ఎదుక్కొంటున్నాడు.అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు వ్యక్తిగత  విషయాలను పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా తమ తల్లిదండ్రులకు తాము ఆరుగురు సంతానమని అలాగే తమ కుటుంబ పోషణ నిమిత్తమై తమ తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారని చెప్పుకొచ్చాడు.తమ ఊర్లో  ఏడవ తరగతి వరకు మాత్రమే పాఠశాల ఉంటుందని ఆ తర్వాత ఇతర చదువులకై తన సోదరి ఇంటికి వెళ్లి చదువుకున్నట్లు ఆయన తెలిపారు.

అలాగే తాను ఇంటర్మీడియట్ చదివే రోజులలో కాలేజీలోనే నైట్ వాచ్ మెన్ గా కూడా పని చేశానని ఆ తర్వాత చదువు పూర్తయిన తర్వాత సినిమాలకు దృష్టి మల్లడంతో బొంబాయి వెళ్ళి సినిమాలలో ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు.కానీ మళ్ళీ ఆర్థిక సమస్యలు ఎదురవడంతో కాలం పాటు బ్యాంకులో క్లర్క్ కూడా పని చేశాడని  తెలిపాడు.

అంతేగాక పలుగవర్నమెంట్ ఉద్యోగాలను కూడా వదులుకున్నానని చెప్పుకొచ్చాడు.

అయితే తెలుగులో ఠాగూర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని ఆ తర్వాత మళ్ళీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని తెలిపాడు.

 అంతేగాక ఇప్పటివరకు తాను తెలుగు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తదితర భాషల్లో నటించినప్పటికీ తెలుగులో మాత్రమే మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చాడు.అందుకే తనని ఇంతగా ఆదరించినటువంటి తెలుగు ప్రేక్షకులకి ఎప్పటికి రుణ పది ఉంటానని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube