ఒకప్పటి ఈ హీరోయిన్ తాగుడికి బానిసై సినిమా జీవితాన్ని నాశనం చేసుకుందట….  

Tollywood veteran heroine Rachana Banerjee real life news, Rachana Banerjee, Tollywood veteran heroine, Tollywood, Bavagaru Bagunnara, kanyadanam, Mohan Babu, Venkatesh , Ravi Teja - Telugu Bavagaru Bagunnara, Kanyadanam, Mohan Babu, Rachana Banerjee, Ravi Teja, Tollywood, Tollywood Veteran Heroine, Venkatesh

తెలుగులో ప్రముఖ దర్శకుడు జయంత్‌సి పరాన్జీ దర్శకత్వం వహించినటువంటి బావగారు బాగున్నారా అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి హీరోయిన్‌గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ రచన బెనర్జీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశం దక్కించుకోవడంతో ఈ  బ్యూటీకి  తెలుగు సినిమా అవకాశాలు వచ్చాయి.

TeluguStop.com - Tollywood Veteran Heroine Rachana Banerjee Real Life News

ఈ క్రమంలో తెలుగులో రచన బెనర్జీ కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజా రవితేజ, సీనియర్ హీరో శ్రీకాంత్ తదితరులు సరసన నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఒకప్పుడు చేతినిండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో రచన బెనర్జీ కొంతమేర పలు చెడు అలవాట్లకు బానిస అయ్యిందని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.

TeluguStop.com - ఒకప్పటి ఈ హీరోయిన్ తాగుడికి బానిసై సినిమా జీవితాన్ని నాశనం చేసుకుందట….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో ముఖ్యంగా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లతో ఏకంగా తన సినీ కెరీర్‌ని కూడా నాశనం చేస్తుందని….దాంతో ఆమె కుటుంబ సభ్యులు సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రోబల్ బసు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారని అప్పట్లో బలంగా టాక్ వినిపించింది.

కానీ పెళ్లయిన తర్వాత కుటుంబ బాధ్యతలను చక్కదిద్దే పనిలో పడినటువంటి రచన బెనర్జీ పూర్తిగా తన చెడు అలవాట్లకు దూరమైంది.మళ్ళీ తన సినీ కెరీర్ పై దృష్టి సారించి అడపాదడపా సినిమాలలో కూడా నటించింది.

కాగా ప్రస్తుతం వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.తొందర్లోనే రచన బెనర్జీ తన కొడుకుని బెంగాలీ భాషలో హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తోందట.

అయితే ఈ విషయం ఇలా ఉండగా రచన బెనర్జీ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, ఒడియాతో పాటు తదితర భాషలలో కలిపి దాదాపుగా 200కు పైగా చిత్రాలలో నటించింది.

#Kanyadanam #Mohan Babu #Venkatesh #Ravi Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Veteran Heroine Rachana Banerjee Real Life News Related Telugu News,Photos/Pics,Images..