కంబ్యాక్ కోసం బాగానే కసరత్తు చేస్తున్న వెటరన్ హీరోయిన్ కానీ….  

Tollywood veteran heroine Kamna jethmalani is again retry as heroine, Kamna jethmalani, Tollywood veteran heroine, Movie offers, Tollywood, ranam, Bendu Apparao RMP, Gopichandh, Bengaloore - Telugu Bendu Apparao Rmp, Bengaloore, Gopichandh, Kamna Jethmalani, Movie Offers, Ranam, Tollywood, Tollywood Veteran Heroine

తెలుగులో ప్రముఖ దర్శకుడు అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన “రణం” అనే చిత్రంలో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బ్యూటీ “కామ్నా జఠ్మలానీ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అంతకు ముందే కామ్నా జఠ్మలానీ ప్రేమికులు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయింది.

TeluguStop.com - Tollywood Veteran Heroine Kamna Jethmalani Is Again Retry As Heroine

 కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవడంతో ఈ అమ్మడుని ఎవరు గుర్తించలేదు.అయితే అడపాదడపా సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఈ అమ్మడుకి ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి.

దీంతో తన వైవాహిక జీవితంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కర్ణాటకలోని బెంగళూరుకు చెందినటువంటి ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం కామ్నా జఠ్మలానీ కి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.అయితే పెళ్లయిన తర్వాత కూడా కామ్నా జఠ్మలానీ అడపాదడపా చిత్రాల్లో నటించింది.

TeluguStop.com - కంబ్యాక్ కోసం బాగానే కసరత్తు చేస్తున్న వెటరన్ హీరోయిన్ కానీ….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కానీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. దీంతో ఈ మధ్యకాలంలో కామ్నా జఠ్మలానీ ఆరోగ్యానికి మేలు చేకూర్చే యోగా, జిమ్ వర్కవుట్లు వంటివి చేస్తూ ఫిట్ నెస్ ని మెయింటైన్ చేస్తోంది.

అంతేగాక తాజా సమాచారం ప్రకారం కామ్నా జఠ్మలానీ మళ్లీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో కామ్నా జఠ్మలానీ నటించిన “బెండప్పారావు ఆర్ఎంపీ, రణం, సామాన్యుడు, కత్తి కాంతారావు” తదితర చిత్రాలు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకోవడంతో పాటు ఈ అమ్మడుకి మంచి గుర్తింపు తెచ్చాయి.

కాగా ప్రస్తుతం కామ్నా జఠ్మలానీ తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

#Bengaloore #Ranam #Gopichandh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Veteran Heroine Kamna Jethmalani Is Again Retry As Heroine Related Telugu News,Photos/Pics,Images..