పాపం : ఆ డ్యాన్స్ మాస్టర్స్ కోసం రాకేష్ మాస్టర్ తన భార్యని కూడా వదిలేసాడంట..

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది డాన్స్ కొరియోగ్రాఫర్స్ ని పరిచయం చేసినటువంటి సీనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఈ మధ్య ఇంటర్వ్యూల పేరుతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో తన మొదటి భార్యకు విడాకులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే  విషయంపై స్పందించాడు.

 Tollywood Veteran Dance Choreographer Rakesh Master React About His First Wife D-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా అప్పట్లో తాను తిరుపతిలో ఉండేవాడినని ఆ సమయంలో ప్రస్తుతం డాన్స్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న ఇద్దరు డాన్స్ కొరియోగ్రాఫర్లను చేరదీశానని ఆ సమయంలో వారికి తన భార్య అన్నం పెట్టే విషయంలో గొడవ జరిగిందని దాంతో ఆమెకు విడాకులు ఇచ్చానని తెలిపాడు.అంతేకాక ఒకప్పుడు తాను ఎంతో ఆదరించిన ఆ ఇద్దరూ మోసం చేసి వెళ్లిపోయారని ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో బాగానే రాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతేగాక అప్పట్లో తన మీద ఉన్న అభిమానంతో ఆ ఇద్దరిలో ఓ డాన్స్ కొరియోగ్రాఫర్ ఏకంగా తన చేతి పై తన పేరును పచ్చబొట్టు లాగా వేయించుకున్నాడని కానీ అతడే చివరికి తనని మోసం చేసి వెళ్లి పోతాడని అనుకోలేదని చెప్పుకొచ్చాడు.

అయితే ఇటీవలే కర్నూలు జిల్లాకు చెందిన పుల్లయ్య అనే యువకుడు తన అభిమానిని చెప్పడంతో అతడిని హైదరాబాద్ కి తీసుకొచ్చి ఏకంగా హీరోని చేయాలని శిక్షణ ఇచ్చాడు.

 కానీ అతడు కూడా ఇటీవలే రాకేష్ మాస్టర్ ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు.అంతేగాక రాకేష్ మాస్టర్ ని వదిలిపెట్టి వచ్చిన అనంతరం పుల్లయ్య పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 ఇందులో భాగంగా రాకేష్ మాస్టర్ తనని అసభ్య పదజాలంతో దూషించాడని అంతేగాక సినిమా అవకాశం పేరుతో దారుణంగా మోసం చేశాడని అంటూ కామెంట్లు చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube