బ్రహ్మానందం : నేను కూడా సాయం చేసాను కానీ.. ఫొటోలు తీసుకోలేదు...

తన హాస్యంతో దాదాపుగా మూడు తరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన అలాగే ఇప్పటికీ నవ్విస్తున్న “ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే బ్రహ్మానందం దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ హీరోల చిత్రాలలో కామెడీని పండిస్తూ బాగానే ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

 Brahmanandam, Tollywood Veteran Comedian,  Sonu Sood Help In Corona Time, Tollyw-TeluguStop.com

అయితే తాజాగా ఈ కరోనా వైరస్ కాలంలో ప్రజలకి అండగా నిలుస్తూ తనకు చేతనైనంత సాయం చేస్తూ కష్టాల్లో ఉన్నటువంటి వారికి తన హస్తాన్ని అందించినటువంటి ప్రముఖ నటుడు సోనుసూద్ గురించి స్పందించాడు.

ఇందులో భాగంగా సోను సూద్ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకి అండగా నిలిచి చాలా గొప్ప పని చేశాడని అతడు చేసిన మంచి పనుల గురించి కొనియాడాడు.

 అంతేగాక సోనూసూద్ కూడా సినీ పరిశ్రమకు వలస వచ్చిన వారే కాబట్టి వలస బాధితుల బాధలు అతడు అర్థం చేసుకున్నాడని అందుకే తమ స్వస్థలాలకు చేరుకునేందుకు తన సొంత డబ్బులు వెచ్చించి సహాయం చేశాడని తెలిపాడు.అంతేగాక తాను కూడా సినీ పరిశ్రమలో కొంత మందికి సహాయం చేశానని కానీ సాయం చేసిన సమయంలో ఫోటోలు తీసుకోలేదని సరదాగా చెప్పుకొచ్చాడు.

ఏదేమైనప్పటికీ ఈ కరోనా వైరస్ క్లిష్ట కాలంలో మాత్రం సెలబ్రిటీలు తమ వంతు చేతనైనంత సహాయం అందిస్తూ ప్రజలకు అండగా నిలిచారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇందులో కొంతమంది డబ్బు రూపంలో సహాయం చేస్తే మరి కొంతమంది కరోనా వైరస్ నియంత్రించడానికి తీసుకునే జాగ్రత్తలు, సలహాలు వంటివాటిని ప్రజల్లోకి తీసుకు వెళుతూ ప్రచారాలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube