రోజా స్టార్ హీరోయిన్ కావడానికి ఆమె కారణమట…. ఇంతకీ ఎవరామే…  

Tollywood Veteran Actress Roja Sarpayagam Movie Offers News - Telugu Ap Politician, Meena, Mla, Roja, Tollywood, Tollywood Heroine, Veteran Actress

తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా, ప్రస్తుతం ప్రజలకు సేవ చేస్తున్నటువంటి రాజకీయ నాయకురాలిగా పని చేస్తున్న సీనియర్ హీరోయిన్ నటి రోజా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె అప్పట్లో దాదాపుగా అందరి సీనియర్ హీరోలను కవర్ చేస్తూ నటించి ప్రేక్షకులని బాగానే మెప్పించింది.

 Tollywood Veteran Actress Roja Sarpayagam Movie Offers News

అయితే ఈ మధ్య కాలంలో నటి రోజా గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వార్త ఏంటంటే తెలుగు సినీ పరిశ్రమలో నటి రోజా స్టార్ హీరోయిన్ కావడానికి ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా పరోక్షంగా సాయం చేశారని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

రోజా స్టార్ హీరోయిన్ కావడానికి ఆమె కారణమట…. ఇంతకీ ఎవరామే…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇంతకీ అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ ప్రముఖ హీరో హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పరుచూరి బ్రదర్స్ ఆ చిత్రంలో నటింపజేయడానికి ముందుగా హీరోయిన్ మీనా ని కన్ఫమ్ చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమెను తొలగించాల్సి వచ్చింది.అయితే సరిగ్గా అదే సమయంలో నటి రోజా పేరు ప్రస్తావనకు రావడంతో ఆమె మీనా పాత్ర స్థానంలో నటించే అవకాశం దక్కించుకుంది.

అయితే రోజా నటించినటువంటి ఆ చిత్రం మంచి హిట్ అయ్యింది.

ఆ తరువాత రోజా వరుసగా చిరంజీవి, బాలకృష్ణ తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను దక్కించుకుని ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల సరసన వెలుగొందింది.

అయితే ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి దిగ్విజయం సాధించింది.ప్రస్తుతం నటి రోజా రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటూనే మరో పక్క ప్రముఖ కామెడీ షోలైన జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ లలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Veteran Actress Roja Sarpayagam Movie Offers News Related Telugu News,Photos/Pics,Images..

footer-test