సుడిగాలి సుధీర్ ది వేరే లెవెల్ టాలెంట్ అంటూ పొగిడిన రేణూ దేశాయ్...

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం లాక్ డౌన్ విధించడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి పట్టునే ఉంటుంది.దాంతో ఈ మధ్య రేణు దేశాయ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించింది.

 Renu Desai, Tollywood Veteran Actress,  Sudigali Sudheer,  Comedian And Hero, To-TeluguStop.com

ఇందులో భాగంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలను ఇచ్చింది.

అయితే ఈ క్రమంలో ఓ  నెటిజన్ మీరు ప్రముఖ రియాల్టీ గేమ్ షో “బిగ్ బాస్ నాలుగో సీజన్ కి” వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి నిజమేనా అంటూ అడిగాడు.

దీంతో రేణు దేశాయ్ ఈ విషయం గురించి స్పందిస్తూ ప్రస్తుతానికి అయితే లేదని హోస్ట్ గా వ్యవహరించాలి అంటే చాలా అనుభవం ఉండాలని తెలిపింది.అంతేగాక తాను ఈ మధ్య తెలుగులో యాంకర్ సుమ, సుడిగాలి సుదీర్ తదితర యాంకర్లను చూశానని వీళ్ళ టాలెంట్ వేరే లెవెల్ అని చెప్పుకొచ్చింది.

దీంతో సుడిగాలి సుధీర్ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో రేణు దేశాయ్ చేసినటువంటి వ్యాఖ్యలను తెగ వైరల్ చేస్తున్నారు.అంతేగాక “థాంక్యూ వదినమ్మ” అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా రేణు దేశాయ్ బద్రి సినిమాలో నటించిన తర్వాత పెళ్లవడంతో పూర్తిగా సినిమాలకి దూరం అయింది.అయితే తొందర్లోనే తన ఓ సరికొత్త చిత్రంతో నటిగా ముందుకు వస్తానని ఈ  చిట్ చాట్ కార్యక్రమంలో తెలిపింది.

కాగా ఇటీవలే టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ నిర్మాత తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న చిత్రంలో తల్లి పాత్రను ఆఫర్ చేయగా రేణు దేశాయ్ పలు వ్యక్తిగత కారణాల వల్ల తిరస్కరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube