అప్పట్లో ఈ స్టార్ హీరోయిన్ కి సొంత విమానం ఉండేదట.. కానీ..  

Tollywood veteran actress kr vijaya own flight news, kr vijaya, Tollywood veteran actress, Sudarshan velayutham, Producer, own flight news, sri krishna pandaveeyam telugu movie - Telugu Kr Vijaya, Own Flight News, Producer, Sri Krishna Pandaveeyam Telugu Movie, Sudarshan Velayutham, Tollywood Veteran Actress, Tollywood Veteran Actress Kr Vijaya Own Flight News

తెలుగులో 1966వ సంవత్సరంలో ప్రముఖ స్వర్గీయ నటుడు అన్నగారు నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించిన “శ్రీకృష్ణ పాండవీయం” అనే పౌరాణిక చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయినటువంటి మలయాళ నటి కె.ఆర్.విజయ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే శ్రీ కృష్ణ పాండవీయం చిత్రం కంటే ముందు తమిళం, మలయాళం భాషలలో నటించినప్పటికీ  ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు.

TeluguStop.com - Tollywood Veteran Actress Kr Vijaya Own Flight News

కానీ శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలోని రుక్మిణీ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.అయితే ఇటీవలే ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి కె.ఆర్.విజయ పాల్గొంది. ఇందులో భాగంగా తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా తాను ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆ చిత్రానికి ఫైనాన్సియర్ గా వ్యవహరించిన ప్రముఖ సినీ నిర్మాత సుదర్శన్ వెళయాతుం ని పెళ్లి చేసుకున్నానని తెలిపింది.

TeluguStop.com - అప్పట్లో ఈ స్టార్ హీరోయిన్ కి సొంత విమానం ఉండేదట.. కానీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీకు పెళ్లయిన సమయంలోనే సొంత విమానం కూడా ఉండేదని పలు వార్తలు వినిపిస్తున్నాయని ఈ విషయం నిజమేనా అంటూ ప్రశ్నించగా కె.ఆర్.విజయ సమాధానం చెబుతూ నిజమేనండి.! అప్పట్లో తన భర్తకి సొంత విమానం, పడవలు మరియు ఖరీదైనటువంటి హోటళ్లు వంటివి ఉండేవని తెలిపింది.

అలాగే తాము నలుగురు అక్క-చెల్లెళ్ళు అని ఇందులో ఒకరు మరణించగా తన ఇద్దరి చెల్లెళ్లు ప్రస్తుతం నటనారంగంలో బాగానే రాణిస్తున్నారని తెలిపింది.తన భర్త మలయాళంలో దాదాపుగా 60 చిత్రాలకు పైగా ఫైనాన్సియర్ వ్యవహరించాడని, అప్పట్లో తాను తన భర్త ని తమ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నానని కానీ గర్భం దాల్చిన తర్వాత కాన్పు కోసమని ప్రైవేట్ విమానంలో వెళ్ళినప్పుడు విమానం నుంచి మెట్లు దిగుతున్న సమయంలో  కొందరు తన ఫోటోలను తీసి పత్రికల్లో ప్రచురించారని ఆ విధంగా తనకి పెళ్లి అయినట్లు తన కుటుంబ సభ్యులకు తెలిసిందని చెప్పుకొచ్చింది.

తనకు ఇంతకు ముందే పెళ్లయినట్లు తెలిసినప్పటికీ తన కుటుంబ సభ్యులు తన  నిర్ణయాన్ని గౌరవించి స్వాగతించారని తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో హీరోయిన్ గా దాదాపుగా అప్పట్లో 100కు పైగా చిత్రాలలో కె.ఆర్.విజయ నటించింది.  ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కూడా బాగానే రాణిస్తోంది.కాగా కె.ఆర్.విజయ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో దాదాపుగా 400కు పైగా చిత్రాలలో నటించింది. అలాగే పలు ధారావాహికలలో కూడా నటించింది.కాగా ప్రస్తుతం కె ఆర్ విజయ తన కుటుంబ సభ్యులతో కలిసి కేరళలోని త్రివేండ్రం లో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఉంటున్నట్లు సమాచారం.

#Kr Vijaya #Producer #SriKrishna #Own Flight News

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Veteran Actress Kr Vijaya Own Flight News Related Telugu News,Photos/Pics,Images..