900 కి పైగా చిత్రాల్లో నటించా…. కానీ అంటూ ఎమోషనల్ అయిన శ్రీహరి భార్య…  

Tollywood veteran actress Disco Shanthi Emotional About Sriharim Death, Disco Shanthi, Tollywood veteran heroine, Real Star Srihari Death News, Meghamsh Srihari, Tollywood young hero, - Telugu Meghamsh Srihari, Real Star Srihari Death News, Tollywood Veteran Heroine, Tollywood Young Hero

తెలుగులో ఎలాంటి సినిమా కుటుంబ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన స్టార్ హీరోల్లో  ప్రముఖ స్వర్గీయ నటుడు రియల్ స్టార్ శ్రీహరి ఒకరు.అయితే శ్రీహరి హీరో పాత్రలో మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించి బాగానే మెప్పించాడు.

TeluguStop.com - Tollywood Veteran Actress Disco Shanthi Emotional About Sriharim Death

 అయితే వరుస అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో అనుకోకుండా గుండె పోటుకు గురై 49 ఏళ్ల వయసులో మృతి చెందాడు.కాగా తాజాగా రియల్ స్టార్ శ్రీహరి భార్య డిస్కోశాంతి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని శ్రీహరి గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా శ్రీహరి సినిమా పరిశ్రమలోని వ్యక్తులు లేదా బయట వ్యక్తులు ఎవరైనా సరే సహాయం కోసం ఇంటికి వస్తే కచ్చితంగా లేదనకుండా ఎంతో కొంత సహాయం చేసే వారని కొంతమేర ఎమోషనల్ అయ్యింది. అంతేకాక శ్రీహరి తాను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో ప్రత్యేకంగా కొంత సహాయ కార్యక్రమాల కోసం ఉపయోగించేవారని అలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా నా జీవితానికి తీరని లోటని చెప్పుకొచ్చింది.

TeluguStop.com - 900 కి పైగా చిత్రాల్లో నటించా…. కానీ అంటూ ఎమోషనల్ అయిన శ్రీహరి భార్య…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తాను కూడా శ్రీహరిని పెళ్లి చేసుకోక ముందు దాదాపుగా 900కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించానని తెలిపింది అయితే ఇందులో తెలుగులో తాను చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మలయాళం, హిందీ, కన్నడ, ఒడియా, బెంగాలీ, భోజపూరి తదితర భాషలలో ఎక్కువ శాతం చిత్రాలలో నటించానని చెప్పుకొచ్చింది.

అయితే ప్రస్తుతం తాను తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలో నివాసం ఉంటున్నట్లు తెలిపింది.

 అలాగే అప్పట్లో తాను సంపాదించిన ఆస్తులను అమ్మి ఇటీవలే తన పిల్లల చదువులకి ఉపయోగించానని చెప్పుకొచ్చింది.అయితే ఈ  విషయం ఇలా ఉండగా ఆ మధ్య శ్రీహరి పెద్ద కొడుకు మేఘంష్ శ్రీహరి రాజ్ దూత్ అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యాడు.

#TollywoodYoung #RealStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Veteran Actress Disco Shanthi Emotional About Sriharim Death Related Telugu News,Photos/Pics,Images..