వాణి విశ్వనాథ్ నట వారసురాలు హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చిరనజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ తో ఒకప్పుడు ఆడిపాడిన మలయాళీ ముద్దుగుమ్మ వాణీ విశ్వనాథ్.30 ఏళ్ల క్రితం సౌత్ లో గ్లామర్ క్వీన్ గా ఒక వెలుగు వెలిగింది.సీనియర్ ఎన్టీఆర్ సైతం ఈమె అందానికి దాసోహం అయిపోయాడనే టాక్ అప్పట్లో నడిచింది.చాలా గ్యాప్ తర్వాత జయ జానకీ నాయక సినిమాతో వాణీ విశ్వనాధ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చింది.

 Tollywood Vani Viswanath Sister Daughter Varsha Entry In Movies-TeluguStop.com

అలాగే తెలుగుదేశం పార్టీలో చేరి ఏపీ రాజకీయాలలో క్రియాశీలకంగా భాగం కావాలని అనుకుంటుంది.ఇదిలా ఉంటే వాణీ విశ్వనాథ్ నట వారసురాలిగా ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

వాణీ విశ్వనాథ్‌ సోదరి ప్రియా విశ్వనాథ్‌ కూతురు వర్ష రెడ్డిగారింట్లో రౌడీయిజం అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది.

 Tollywood Vani Viswanath Sister Daughter Varsha Entry In Movies-వాణి విశ్వనాథ్ నట వారసురాలు హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఈ బ్యూటీ తమిళంలో తెరంగేట్రం చేసి మూడు సినిమాలలో నటించింది.

కేరళ త్రిస్సూర్‌లో ఇంటర్‌ పూర్తి చేసిన వర్ష పెద్దమ్మ బాటలో హీరోయిన్ గా రాణించేందుకు అడుగులు వేస్తుంది.రెడ్డిగారింట్లో రౌడీయిజం సినిమాలో రమణ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతూ ఉండగా అతనికి జోడీగా వర్ష నటిస్తుంది.

ఎం.రమేశ్‌, గోపీ సంయుక్తంగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు చిత్రాలకు ఈ బ్యూటీ సంతకం చేశారు.రెండో చిత్రం హీరో రమణ్‌తో వట్టికూటి చంద్ర దర్శకత్వంలో చేయనున్నారు.

అలాగే సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరితో ఓ సినిమా చేయడానికి ఒకే చెప్పింది.మరి వర్షని ఆమె పెద్దమ్మ వాణీ విశ్వనాధ్ తన పరిచయాలు ఉపయోగించుకొని ప్రోత్సహిస్తుందేమో చూడాలి.

#Varsha #Vani Viswanath #Movies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు