పుల్లయ్యని హీరో చేద్దామని తెచ్చి రాకేష్ మాస్టర్ పిచ్చి పుల్లయ్యను చేసాడంట...

ఒకప్పుడు మంచి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆ మధ్య కాలంలో ఇంటర్వ్యూల పేరుతో ఎదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలిచాడు రాకేష్ మాస్టర్.

 Jr Rakesh Comments On Rakesh Master,rakesh Master, Dance Choreographer, Jr Rakes-TeluguStop.com

ఈ క్రమంలో రాకేష్ మాస్టర్ అభిమాని పుల్లయ్య అనే యువకుడికి హీరో కావాలని ఉందని తెలియడంతో అతడిని చేరదీసి ఆశ్రయమిచ్చి పుల్లయ్యని హీరోని చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా రాకేష్ మాస్టర్ పుల్లయ్య కి డైలాగులు చెప్పడం, నటనలో మెళుకువలు నేర్పించడం, డ్యాన్స్ లో చిన్నచిన్న స్టెప్పులు నేర్పించడం వంటివి చేస్తున్నాడు.

అయితే ఏమైందో ఏమో గానీ ఉన్నట్లుండి ఇటీవలే పుల్లయ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని రాకేష్ మాస్టర్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.అయితే ఇందులో ముఖ్యంగా తాను అనవసరంగా రాకేష్ మాస్టర్ ని నమ్మి ఇంత దూరం వచ్చానని వాపోయాడు.

అంతేగాక ఇంటర్వ్యూ చేసే యాంకర్ రాకేష్ మాస్టర్ మిమ్మల్ని హీరో చేస్తానని కొన్ని సందర్భాలలో చెప్పాడని చెబుతుండగా పుల్లయ్య కలుగజేసుకుని అసలు ఇప్పటి వరకు తన సినిమాకి సంబందించిన సినిమా స్టోరీ ని తనతో రాకేష్ మాస్టర్ చెప్పలేదని అంతేగాక అప్పుడప్పుడు పలుమార్లు అసభ్య పదజాలంతో దూషించే వాడని చెప్పుకొచ్చాడు.

దీంతో ఈ విషయంపై స్పందించిన రాకేష్ మాస్టర్ పుల్లయ్య తల్లి తనకు ఆడపడుచుతో సమానమని అందువల్లనే పుల్లయ్య కి ఆశ్రయమిచ్చి చేరదీశానని తెలిపాడు.

అంతేకాక పుల్లయ్య మీద నమ్మకంతో తన బ్యాంకు ఖాతా వివరాలు మరియు ఏటీఎం కార్డులు అతడి దగ్గరే ఉండేవని కానీ పుల్లయ్య మాత్రం వాటిని తనకు చెప్పకుండా పలు సందర్భాల్లో దుర్వినియోగం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.దీంతో ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ రాకేష్ మాస్టర్ పుల్లయ్య హీరోని చేస్తానంటూ తీసుకొచ్చి పిచ్చి పుల్లయ్యను  చేశాడంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం తనకు ఆశ్రయమిచ్చి తిండి పెట్టి హీరోకి కావలసిన శిక్షణ ఇచ్చినటువంటి రాకేష్ మాస్టర్ పై పుల్లయ్య ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube