అన్ సీజన్ ని కూడా అనుకూలంగా మార్చుకుంటున్న టాలీవుడ్ దర్శక నిర్మాతలు

సాధారణంగా సంక్రాతికి విడుదలయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.ఆ తర్వాత సమ్మర్ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తారు.

 Tollywood Unseason Hits In February Month Details, Tollywood Movies,released In-TeluguStop.com

ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సినిమాలను ఎక్కువగా విడదల చేయరు.కారణం ఏంటంటే ఈ సమయంలో విద్యార్థులు తమ తమ చదువుల్లో బిజీగా ఉంటారు.

కానీ తాజాగా ఈ సీజన్ లో సినిమాలు విడుదల అయినా.మంచి సక్సెస్ కొడతాయని నిరూపితం అయ్యింది.

ఉప్పెన, జాతిరత్నాలు అనే సినిమాలు పాత పద్దతికి చెక్ పెట్టాయి.ఈ రెండు సినిమాలు భారీ హిట్లు సాధించాయి.

ఓ రేంజిలో వసూళ్లు సాధించాయి.కరోనా తర్వాత విద్యాసంస్థలు ఓపెన్ కావడంతో విద్యార్థుల నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ దొరికింది.

ఇదే విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పలువురు సినిమా దర్శక నిర్మాతలు.వచ్చే ఏడాది డ్రై టైంలో తమ సినిమాలను విడుదల చేసేందుకు భారీ సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్యతో పాటు ఎఫ్-3, మేజర్ లాంటి సినిమాలు ఏప్రిల్, ఆ తర్వాత విడుదలకు రెడీ అవుతున్నాయి.విద్యార్థులకు ఎగ్జామ్స్ సమయం అయినా.అదే సమయంలో ఈ సినిమాలను విడుదల చేయాలని భావిస్తన్నారు.ఈ ఏడాది నవంబర్ మాత్రం అన్ సీజన్ ను తలపిస్తోంది.

దసరాకు విడుదలైన కొన్ని సినిమాలు తప్ప మిగతా సినిమా అంతా హిట్ కాలేదు.పుష్పక విమానం, తెలంగాణ దేవుడు, రాజా విక్రమార్క, ఎనిమీ, పెద్దన్న సహా పలు సినిమాలు అంతగా జనాలను ఆకట్టుకోలేదు.

అటు ఈ నెలలో కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.వాటిపై పెద్దగా బిజినెస్ అవుతుందో? లేదో? కూడా చెప్పడం కష్టం.కీర్తి సురేష్ నటిస్తున్న గుడ్ లక్ సఖి, రాజ్ తరుణ్ నటిస్తున్న అనుభవించు రాజాతో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.అటు డిసెంబర్ తొలి వారంలో బాలయ్య అఖండ రిలీజ్ అవుతుంది.

అదే నెల 17న అల్లు అర్జున్ మూవీ పుష్ప కూడా విడుదల అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube