సెకన్ల పాటు కనిపించి ఉర్రూతలూగించిన స్టార్స్ వీళ్లే..?

మనలో చాలామంది వినోదం కోసం సినిమాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతాం.మన ఫేవరెట్ హీరో సినిమాలోని పాటల్లో మరో స్టార్ హీరో లేదా స్టార్ హీరోయిన్ కూడా కనిపిస్తే మన సంతోషానికి అవధులు ఉండవు.

 Tollywood Top Heroes Special Appearance In Another Hero Film Songs, Akhil, Anot-TeluguStop.com

ఇండస్ట్రీలో చాలామంది హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి ఆ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడానికి కారణమయ్యారు.చిరంజీవి హీరోగా వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటలో చరణ్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు.చరణ్, చిరంజీవి కలిసి వేసిన స్టెప్పులను చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోయారు.

శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలోని నా పేరే కాంచనమాల పాటలో శ్రీకాంత్ నోటిలో మందు పోస్తూ పవన్ కళ్యాణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.విక్టరీ వెంకటేష్, అనుష్క కాంబినేషన్ లో తెరకెక్కిన చింతకాయల రవి సినిమాలో సరదాకే సరాదే పుట్టే పాటలో ఎన్టీఆర్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.

Telugu Akhil, Brahmanandam, Nagarjuna, Pawan Kalyan, Ramcharan, Rana, Shriya, To

తరుణ్ హీరోగా తెరకెక్కిన సోగ్గాడు సినిమాలోని కొక్కరకో పాటలో శ్రియ కొన్ని సెకన్ల పాటు కనిపించి సందడి చేశారు.అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములా పాటలో కమెడియన్ బ్రహ్మనందం కొన్ని సెకన్ల పాటే కనిపించిన స్టెప్పులు అద్భుతంగా వేశారు.రానా హీరోగా తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలోని స్పెషల్ సాంగ్ లో వెంకటేష్ మెరిశారు.అఖిల్ హీరోగా తెరకెక్కిన “అఖిల్” సినిమాలో నాగార్జున అక్కినేని అక్కినేని పాటలో కొన్ని నిమిషాల పాటు కనిపించారు.

Telugu Akhil, Brahmanandam, Nagarjuna, Pawan Kalyan, Ramcharan, Rana, Shriya, To

ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా హీరోలు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.నాగార్జున నటించిన కింగ్ సినిమాలోని తరరంపంపం పాటలో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube