టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికం ఎంతో తెలుసా?

సినీ ప్రపంచం.ఒక రంగుల ప్రపంచం.అదృష్టం ఉంటే ఆకాశాన్ని తాకుతారు.అదే దరిద్రం వెంట వస్తే నెలకు రాలిపోతారు.ఇక అలానే ఒక్క సినిమా హిట్ అయితే ఆ సినిమా హీరో పారితోషికం భారీగా పెరిగిపోతుంది.అదే వరుసగా మూడు ప్లాప్ లు వస్తే అదే హీరో ఆర్ధిక నష్టాలలో మునిగిపోతాడు.ఇక అలాంటి ఈ సినీ ప్రపంచంలో స్టార్ హీరోలుగా ఎదిగిన ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటారో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

 Tollywood Top Heroes Remuneration,remuneration, Tollywood Star Heros, Allu Arjun-TeluguStop.com

ప్ర‌భాస్‌ :

Telugu Allu Arjun, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Charan, Tollywood Her

ఎన్ని సినిమాలు తీసిన రాని గుర్తింపు ఓకే ఒక సినిమా బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో ప్రభాస్.వరల్డ్ రికార్డు సృష్టించిన ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ డాం భారీగా పెరిగిపోయింది.ప్రస్తుతం అయన మూడు సినిమాల్లో నటిస్తున్నారు.ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ తో కలిసి తీసే భారీ బడ్జెట్ చిత్రానికి కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయ్.

మహేష్ బాబు :

Telugu Allu Arjun, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Charan, Tollywood Her

తీసిన సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా డబ్బులు సంపాదించడం ఖాయం.ఆశ్చర్యం వేసినప్పటికి ఇది అక్షరాలా నిజం.ఇటీవల సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు ఒక్క సినిమాకు 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.ఇన్నాళ్లు 40 కోట్లు తీసుకున్న అయన అతని క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని రెమ్యూనరేషన్ రెట్టింపు చేసినట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్ :

Telugu Allu Arjun, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Charan, Tollywood Her

ఇన్నాళ్లు సినిమాలకు దూరం ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు.సినిమాలకు దాదాపు రెండేళ్లు దూరం ఉన్నప్పటికి అయన ఏకంగా 20 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ పెంచేశారట.ప్రస్తుతం ఒక్కో సినిమాకు అయన 50 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

అల్లు అర్జున్ :

Telugu Allu Arjun, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Charan, Tollywood Her

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా సినిమాలు ప్లాప్ అయినప్పటికి అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఇటీవల అలా వైకుంఠపురంతో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు ఒక్కో సినిమాకు 35 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

జూనియ‌ర్ ఎన్టీఆర్ :

Telugu Allu Arjun, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Charan, Tollywood Her

జూనియర్ ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం అరవింద్ సమేత.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.ఇక ఇప్పుడు దర్శక ధీరుడు జక్కన్న రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.ఇక ఎన్టీఆర్ కూడా ఒక్కో సినిమాకు 33 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

రామ్‌ చ‌ర‌ణ్ :

Telugu Allu Arjun, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Charan, Tollywood Her

రంగస్థలం సినిమాతో మంచి సూపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో పాటు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాకు ఎన్టీఆర్ తో సమానంగా 33 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube