కరోనా ప్రభావం దేశ వ్యాప్తంగా అన్ని రంగాలపై పడింది.సినిమా పరిశ్రమపై మరింత తీవ్రంగా పడింది.
సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.మూవీ రిలీజ్ లు నిలిచిపోయాయి.
ఈ దెబ్బతో కొందరు దర్శకనిర్మాతలు ఓటీటీ వేదికగా సినిమాలను విడుదల చేస్తున్నారు.నాని లాంటి స్టార్ హీరో సినిమా సైతం ఓటీటీ లోనే విడుదల అయ్యే పరిస్థితి నెలకొంది.
కొంత మంది దర్శకులు ఇప్పటికే పెద్ద ఫ్లాపులు పొంది బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటాలనుకున్నా.కరోనా మూలంగా పెద్ద దెబ్బ తగిలింది.
బోయపాటి శ్రీను, బాలయ్య బాబు హ్యట్రిక్ కాంబో.చందు, నిఖిల్ కార్తికేయ-2తో పాటు ఇంకా చాలా మంది ఫ్లాప్ ఉన్న దర్శకులు కరోనా మూలంగా షూటింగులు కొనసాగించడం లేదు.మహమ్మారి దెబ్బకు కంబ్యాక్ సినిమాల షూటింగ్ నిలిపేసిన దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
బోయపాటి శ్రీను
వినయ విధేయ రామ సినిమాతో పెద్ద ఫ్లాప్ ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను.ప్రస్తుతం ఆయన బాలయ్యతో అఖండ సినిమా చేస్తున్నాడు.కరోనాతో షూటింగ్ నిలిచిపోయింది.
చందు మండేటి
సవ్యసాచి సినిమాతో భారీ పరాభవాన్ని చూసిన చందు.ప్రస్తుతం నిఖిల్ తో కలిసి కార్తికేయ-2 సినిమా చేస్తున్నాడు.
శ్రీకాంత్ అడ్డాల
బ్రంహ్మోత్సవం సినిమాతో అపజయాన్ని మూటగట్టుకున్న శ్రీకాంత్ అడ్డాల.ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నారప్ప అనే సినిమా చేస్తున్నాడు.
క్రిష్ జాగర్లమూడి
ఎన్టీఆర్ బయోపిక్ తో బోల్తా పడ్డ క్రిష్.ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో సినిమా తెరకెక్కిస్తున్నాడు.
బొమ్మరిల్లు భాస్కర్
ఒంగోలు గిత్త దెబ్బ నుంచి కోలుకోని.మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను రూపొందిస్తున్నాడు.
శ్రీను వైట్ల
అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ఎదురు దెబ్బ తిన్న శ్రీను.ప్రస్తుతం ఢీ-2 సీక్వెన్స్ చేస్తున్నాడు.
సుధీర్ వర్మ
రణరంగం సినిమాతో పరాజయం పాలైన సుధీర్ వర్మ.మిడ్ నైట్ రన్నర్స్ రీమేక్ చేస్తున్నాడు.