దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆర్య సినిమాతో దర్శకునిగా సుకుమార్ కెరీర్ మొదలుపెట్టారు.దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైంది.
ఆ సినిమా తరువాత జగడం, ఆర్య 2, 100 % లవ్, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో,రంగస్థలం సినిమాలకు సుకుమార్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాల్లో కొన్ని సినిమాలు ఫ్లాప్ ఫలితాన్ని అందుకున్నా దర్శకునిగా సుకుమార్ కు అన్ని సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ప్రతి సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే సుకుమార్ తాజాగా ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.దాదాపు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
పుష్ప సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ తో సుకుమార్ ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఇప్పటికే గృహప్రవేశం కూడా జరిగిందని గృహప్రవేశ వేడుకకు అల్లు అర్జున్ తో పాటు పుష్ప సినిమాకు పని చేసిన వాళ్లంతా హాజరయ్యారని సమాచారం.
కరోనా నిబంధనల నేపథ్యంలో చాలా తక్కువ మంది ఈ వేడుకకు హాజరయ్యారని తెలుస్తోంది.కొండాపూర్ ప్రాంతంలో అన్ని సౌకర్యాలతో ఈ ఇల్లు ఉన్నట్టు సమాచారం.
మరోవైపు మారేడుపల్లి పరిసరాల్లో పుష్ప సినిమా షూటింగ్ జరుగుతోంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపించనున్నారు.
అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది.రంగస్థలం తరువాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా విడుదల కానుంది.అల్లు అర్జున్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో పుష్ప సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.
అల్లు అర్జున్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.ఈ సినిమాలో 9 మంది విలన్లు ఉంటారని సునీల్ కూడా ఒక విలన్ పాత్రను పోషిస్తున్నారని తెలుస్తోంది.