50 రోజుల వ్యవధిలో 4 మెగా సినిమాలు విడుదల.. ఏ రికార్డులు నెలకొల్పుతాయో చూడాలి..

Tollywood Top 4movies Updates In Last 50 Days

తెలుగు సినిమా పరిశ్రమలో మెగా కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది.ఆ కుటుంబం నుంచి సుమారు అర డజన్ మంది హీరోలు వచ్చారు.

 Tollywood Top 4movies Updates In Last 50 Days-TeluguStop.com

వీరిలో పలువురు హీరోలు మంచి సక్సెస్ సాధించారు.ఓ పవన్ కల్యాణ్, ఓ రాం చరణ్, అల్లు అర్జున్ సహా పలువురు హీరోలు మంచి విజయాలు అందుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం అదే కుంటుంబ నుంచి సుమారు నలుగురు హీరోల సినిమాలు మూడు నెలల వ్యవధిలో విడుదల అవుతున్నాయి.ఇప్పటికే ఆయా హీరోల సినిమాల రిలీజ్ డేట్లను కూడా ప్రకటించారు దర్శక నిర్మాతలు.

 Tollywood Top 4movies Updates In Last 50 Days-50 రోజుల వ్యవధిలో 4 మెగా సినిమాలు విడుదల.. ఏ రికార్డులు నెలకొల్పుతాయో చూడాలి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ మెగా ఫ్యామిలీకి చెందిన ఏ హీరో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్, రాంచరణ్, పవన్ కల్యాణ్ తో పాటు చిరంజీవి సినిమాలు కూడా వరుస బెట్టి విడుదల అవుతున్నాయి.

మెగా ఫ్యామిలీ నుంచి తొలి సినిమాగా ఈ ఏడాది డిసెంబ‌ర్ 17న బ‌న్నీ న‌టిస్తున్న‌ పాన్ – ఇండియా మూవీ పుష్ప ద రైజ్ రిలీజ్ అవుతుంది.అటు జ‌న‌వ‌రి 7న రాంచ‌ర‌ణ్ న‌టిస్తున్న‌ మ‌రో పాన్ – ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ థియేటర్లలోకి రానుంది.

జ‌న‌వ‌రి 12న ప‌వ‌న్ న‌టిస్తున్న మాలీవుడ్ రీమేక్ మూవీ భీమ్లా నాయ‌క్ సినిమా హాళ్లలో సందడి చేయనుంది.అటు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఫిబ్ర‌వ‌రి 4న విడుదల అవుతుంది.

కేవలం 50 రోజుల వ్యవధిలో మెగా హీరోలకు సంబంధించిన నాలుగు సినిమాలు మెగా అభిమానులను అలరించబోతున్నాయి.

Telugu Acharya, Allu Arjun, Bheemla Nayak, Chirenjeevi, Pawan Kalyan, Pushpa, Ram Charan, Tollywood, Tollywood, Tollywoodtop-Telugu Stop Exclusive Top Stories

అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ సినిమాలు అనుకున్న తేదీల్లోనే రిలీజ్ అయితే.ఈ నాలుగు సినిమాలు సినిమా హాళ్లలో ఆడనున్నాయి.లేదంటే ఏవైనా కారణాలతో ఇబ్బందులు తలెత్తితే మాత్రం సినిమాల విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.

ఏదైతేనేం ఈ నాలుగు సినిమాలు ఎన్ని రోజులు ఆడతాయి.? బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను నెలకొల్పుతాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

#Chirenjeevi #Ram Charan #Pushpa #Pawan Kalyan #Bheemla Nayak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube